బిజినెస్

దేశాభివృద్ధికి సైనికుల్లా కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: దేశాభివృద్ధికి సైనికుల్లా కృషి చేయాలని ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. భారత్‌ను దిగుమతులపై ఆధారపడకుండా చేయాలని, ఆ దిశగా ఉత్పాదక సామర్థ్యం స్వదేశంలో పెంపొందించాలని వారికి సూచించారు. మంగళవారం ఇక్కడ నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగిన ‘చాంపియన్స్ ఆఫ్ చేంజ్’ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన 200లకుపైగా సిఇఒలు, స్టార్టప్‌లను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. నిరుపేదలకు సాయపడేలా రాబోయే దీపావళికి వ్యాపారులు, కార్పొరేట్లు ఖాదీ గిఫ్ట్ కూపన్స్ కొనుగోలుదారులకు, ఉద్యోగులకు ఇస్తే బాగుంటుందని సూచించారు.
ఈ కూపన్లతో ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతాయని అన్నారు. మరోవైపు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అర్వింద్ పనగరియాపై మోదీ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించారు. ఆయన పనితీరు బాగుందని కొనియాడారు. పనగరియా ఈ నెల 31న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి విదేశాల్లో అధ్యాపక వృత్తిలోకి వెళ్తున్నది తెలిసిందే.