బిజినెస్

45 రోజుల్లో నిర్మించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: నల్లగొండ జిల్లాలో నిమ్మ, దొండ, బత్తాయిలకు ప్రత్యేక మార్కెట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అయతే వీటి నిర్మాణం 45 రోజుల్లో పూర్తి కావాలని తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మార్కెట్ల నిర్మాణంపై మంగళవారం ఆ శాఖ అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. 45 రోజుల్లో ఈ మార్కెట్‌ల నిర్మాణం పూర్తి కాకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోనున్నట్టు హెచ్చరించారు.
కోహెడ, పటాన్‌చెరులలో తలపెట్టిన మార్కెట్‌లను అత్యంత ఆధునికంగా జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించాలని మంత్రి స్పష్టం చేశారు. గడ్డి అన్నారం మార్కెట్‌లను కోహెడకు, మలక్‌పేట మార్కెట్‌ను పటాన్‌చెరుకు తరలించాలని ఇంతకుముందే నిర్ణయించారు. ఈ రెండు మార్కెట్‌ల నిర్మాణానికి సంబంధించినవారితో, బిల్డర్లు, బ్యాంకర్లు, ట్రేడర్లు, రైతులు అందరితోనూ విస్తృతంగా చర్చలు జరపాలని, ఆయా వర్గాలకు కావలసిన వసతులు కల్పించాలని సూచించారు. ఈ నిర్మాణాలపై సమగ్ర నివేదికను 15 రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. కాగా, ఈ-నామ్, కోల్డ్ స్టోరేజ్‌లు, ఖరీఫ్ దిగుబడుల సేకరణకు మార్కెటింగ్ శాఖ సిద్ధంగా ఉండాలని చెప్పారు.
ఖరీఫ్‌లో పత్తి దిగుబడి పెరిగే అవకాశం ఉందంటూ పత్తి సేకరణకు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. పత్తి కొనుగోలుకు సంబంధించి కేంద్రాల ఏర్పాటు, తదితర అవసరాల కోసం మార్కెటింగ్ యంత్రాంగం మొత్తం సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్రంలోని 44 వ్యవసాయ మార్కెట్‌లలో ఈ-నామ్ కార్యకలాపాలు విజయవంతంగా జరుగుతున్నాయని, సాఫ్ట్‌వేర్ సమస్యలు తలెత్తినప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని మంత్రి అధికారు లకు సూచించారు. నాబార్డు నిధులు సమీకరించి తొమ్మిది కోల్డ్ స్టోరేజీల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కూడా మంత్రి ఆదేశించారు.
నిబంధనలు సడలించాలి
వ్యవసాయ మార్కెట్‌లలో దడవాయిల లైసెన్స్ బదిలీలో ఉన్న నిబంధనలు సడలించాలని పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. దడవాయిల సంఘం ప్రతినిధులు మంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. దీంతో పెండింగ్‌లో ఉన్న లైసెన్స్‌ల బదిలీ దరఖాస్తులను 15 రోజుల్లో పరిష్కరించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, జెడిలు లక్ష్మణుడు, పి రవికుమార్, డిప్యూటీ డైరెక్టర్ మల్లేశం, ఓఎస్‌డి జనార్దన్‌రావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లో మంగళవారం ప్రత్యేక మార్కెట్ల నిర్మాణంపై జరిగిన సమీక్షలో మార్కెటింగ్ శాఖ అధికారులతో మాట్లాడుతున్న ఆ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు