బిజినెస్

దీపావళికి ఎయిర్‌టెల్ 4జి స్మార్ట్ఫోన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: దేశీయ ప్రైవేట్ రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. దీపావళి కానుకగా ఓ చౌక 4జి స్మార్ట్ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన 4జి టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో 4జి ఫీచర్ ఫోన్‌కు పోటీగా వస్తున్న ఎయిర్‌టెల్ 4జి స్మార్ట్ఫోన్ ధర కేవలం 2,500 రూపాయలేనని తెలుస్తోంది. దీని కోసం ఆయా మొబైల్ ఫోన్ తయారీదారులతో ఎయిర్‌టెల్ ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వీటిలో లావా, కార్బన్ సంస్థలున్నట్లు తెలుస్తోంది. ఇక సెప్టెంబర్ ఆఖర్లోగా లేదా అక్టోబర్ ఆరంభంలోగానీ దీన్ని మార్కెట్‌కు పరిచయం చేయాలన్నది ఎయిర్‌టెల్ ఆలోచన. జియో ఫీచర్ ఫోన్ కంటే అధిక సదుపాయాలతో, నాణ్యతతో దీన్ని తయారు చేయాలని చూస్తోంది. స్క్రీన్, కెమెరా, బ్యాటరీ సామర్థ్యం ఇలా అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది ఎయిర్‌టెల్. ఈ క్రమంలోనే పలు సంస్థలతో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నట్లు వినిపిస్తోంది. ఉచిత 4జి సేవలతో టెలికామ్ ఆపరేటర్ల ఆదాయానికి గండి కొట్టిన జియో.. ఇప్పుడు ఉచిత 4జి ఫీచర్ ఫోన్‌తో మొబైల్ తయారీ సంస్థల ఆదాయానికీ చెక్ పెట్టే దిశగా వెళ్తున్నది తెలిసిందే. ముందు 1,500 రూపాయలు డిపాజిట్‌గా చెల్లించి జియో ఫీచర్ ఫోన్‌ను తీసుకోవచ్చు. అయితే ఈ సొమ్ము మూడేళ్ల తర్వాత తిరిగి చెల్లించేస్తామని జియో స్పష్టం చేసింది. ఈ నెల 24న (గురువారం) జియో 4జి ఫీచర్ ఫోన్ ముందస్తు బుకింగ్స్ మొదలవుతున్నాయి. నెలకు 153 రూపాయల సబ్‌స్క్రిప్షన్ ఫీజుపై అపరిమిత వాయిస్ కాల్స్, ఇంటర్నెట్, ప్రీ-లోడెడ్ జియో యాప్స్, లైవ్ టెలివిజన్, సినిమా, మ్యూజిక్, ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సప్ తదితర సేవల వినియోగానికి వీలుగా ఇంటర్నెట్‌ను పొందవచ్చు. కాగా, జియో ప్రకటనతో దేశీయ సంస్థలతోపాటు విదేశీ సంస్థలు, ముఖ్యంగా చైనా సంస్థలు చౌక 4జి ఫోన్ల తయారీపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో ఎయిర్‌టెల్ సొంతంగా ఓ స్మార్ట్ఫోన్ తయారీకి సిద్ధపడటం.. ఆయా మొబైల్ తయారీ సంస్థలకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే జియో దెబ్బకు మార్కెట్‌లో వాటాను కోల్పోతున్న తమను ఎయిర్‌టెల్ 4జి స్మార్ట్ఫోన్ కోలుకోకుండా చేస్తుందన్న భయాలు మొబైల్ సంస్థల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుంటే వొడాఫోన్ ఇండియాతో విలీనమవుతున్న ఐడియా సెల్యులార్ కూడా ఓ 4జి ఫీచర్ ఫోన్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టాలని చూస్తోంది. దీని ధర కూడా దాదాపు 2,500 రూపాయలుగానే ఉంటుందని ప్రకటించగా, డ్యూయల్ సిమ్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 2జి, 3జి నెట్‌వర్క్‌నూ వినియోగించుకోవచ్చు. మరోవైపు చౌక ధరల మొబైల్స్ తయారీ సంస్థ ఇంటెక్స్ కూడా ఓ 4జి ఫోన్‌ను తెస్తుండగా, టర్బోప్లస్ 4జి పేరుతో నవరత్న ఫీచర్ ఫోన్ సిరీస్‌లో భాగంగా వస్తున్న ఈ 4జి విఒఎల్‌టిఇ ఫీచర్ ఫోన్ ధర 1,999 రూపాయలే. ఏదిఏమైనా టెలికామ్ సేవలతోపాటు మొబైల్స్ తయారీ రంగంలోకీ దేశీయ టెలికామ్ ఆపరేటర్లు జియో పుణ్యమాని వచ్చేస్తున్నారు.