బిజినెస్

విదేశీ సంస్థల పెత్తనం తగ్గాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 14: దేశం ఆర్థికంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ నిరక్షరాస్యుల నుంచి సైతం పొదుపును సేకరించడంలో ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) దూసుకెళ్తోందని, దేశ ఆర్థిక వ్యవస్థకు వెనె్నముకగా నిలుస్తోందని బీమా ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు అమానుల్లా ఖాన్ అన్నారు. అలాంటి ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. విదేశాల్లో దివాలా తీసిన బీమా సంస్థలకు నేడు భారీ పెట్టుబడుల ద్వారా దేశంలో స్థావరం ఏర్పాటు చేసుకోవటానికి కేంద్రం ఊతమిస్తుండటం బాధాకరమన్నారు. అందుకే ఇలాంటి కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేసేలా సెప్టెంబర్ 2న దేశ వ్యాప్తంగా వివిధ జాతీయ కార్మిక సంఘాల స్వతంత్ర సమాఖ్యలు కలిసి 12 కోట్ల మంది ఉద్యోగ కార్మికులతో చరిత్రాత్మక సమ్మెను నిర్వహించబోతున్నాయన్నారు. ఈ సందర్భంగా కార్మిక వర్గ డిమాండ్‌లను మరోసారి పార్లమెంట్, పాలకవర్గాల ఎదుట ఉంచడం జరుగుతుందన్నారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక దేశంలో 23 ప్రైవేట్‌రంగ జీవిత బీమా సంస్థలు విదేశీ సంస్థల భాగస్వామ్యంతో ఎంతగా పోటీబడుతున్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో తొలి ప్రీమియం ఆదాయం సేకరణలో 70.44 శాతం వాటాను, పాలసీల సమీకరణలో 76.84 శాతం మార్కెట్ వాటాతో ఎల్‌ఐసి మార్కెట్ లీడర్‌గా నిలిచిందన్నారు. చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీ రేట్ల తగ్గింపు, అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం, సంక్షోభం, ద్రవ్యోల్బణ ప్రభావమే కరవు పరిస్థితులు కారణంగా ప్రభుత్వమే నిర్దేశిత జిడిపి వృద్ధి రేటు అంచనాలకు చేరుకోలేని స్థితిలో ఎల్‌ఐసి వెనె్నముకగా నిలిచిందన్నారు. ఒక్క రైల్వేశాఖకే లక్షా 50 వేల కోట్ల రూపాయలను రుణంగా అందించడం జరిగిందన్నారు. అలాగే వందలాది కోట్లతో వౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందన్నారు. అయినా ప్రపంచం గర్వించదగ్గ రీతిలో ఎల్‌ఐసి పని చేస్తుంటే సేవాపన్ను, ఆదాయపు పన్ను వంటి భారాలు కుంగదీస్తున్నాయన్నారు. అయినా 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసి 2.05 కోట్ల నూతన పాలసీలతో గతంలో ఎన్నడూలేని విధంగా తొలి ప్రీమియంలోనే 64,500 కోట్ల రూపాయలను సేకరించటం జరిగిందని అమానుల్లా ఖాన్ తెలిపారు. ఎల్‌ఐసి పెట్టుబడులతో ఆదాయం ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే లక్షా 59 వేల కోట్ల రూపాయలుగా నమోదైందన్నారు. మార్చి మాసాంతానికి 93,369 కోట్ల రూపాయల మిగులు మొత్తాన్ని నమోదు చేసి, 39.40 శాతం వృద్ధిని సాధించడంతోపాటు పాలసీదారులకు 34,208 కోట్ల రూపాయలను బోనస్ రూపేణ అందచేయడం జరిగిందని వివరించారు. అంతేగాక ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో 1,801 కోట్ల రూపాయలను ఆందచేయడం జరిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వంగా బీమా వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) పరిమితిని 26 నుంచి 49 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం వల్ల పొదుపు మొత్తంపై, అలాగే జీవిత బీమా పరిశ్రమపై విదేశీ సంస్థల పట్టు చిక్కే అవకాశముందన్నారు. అందుకే ఈ చర్యలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 2న పాలకుల కళ్లు తెరచేలా ఉద్యమించబోతున్నామన్నారు.

chitram విలేఖరులతో మాట్లాడుతున్న అమానుల్లా ఖాన్