బిజినెస్

మరిన్ని కొత్త ఎయిర్‌పోర్టులు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, మే 14: దేశ విస్తీర్ణానికి తగ్గట్లుగా ఎయిర్ పోర్టులు లేవని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. హైదరాబాద్, బెంగ ళూరు, ఢిల్లీల్లో మాత్రమే మోడరన్ ఎయిర్‌పోర్టులు ఉన్నాయని, తూర్పులో రెండు, పశ్చిమలో మరో రెండు కొత్త ఎయిర్‌పోర్టులు కావాల్సిన అవసరముందన్నారు. కొత్తవాటికోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని, అదే బాటలో ఏపి వెళ్ళాలని సూచించారు. కాగా, విశాఖపట్నం వద్ద ఉన్న భోగాపురం ఎయిర్‌పోర్టును మరింత అభివృద్ధి చేసి, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. రాజమండ్రి రన్‌వేను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కావల్సిన భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, దానిని పరిశీలిస్తున్నట్టు కూడా మంత్రి తెలిపారు. ఇదిలావుండగా తాడేపల్లిగూడెంలో రన్‌వేను తాను స్వయంగా చూడలేదని, అయితే గూగుల్ మ్యాప్‌లో పరిశీలిస్తే రన్‌వే చుట్టూ ఇళ్లు ఉన్నాయన్నారు. రన్‌వే నిర్మాణానికి స్థలం ఎక్కువ అవసరమని, అప్పుడే దానిని అభివృద్ధి చేయగలమని స్పష్టం చేశారు. తిరుపతిలో కొత్త టెర్మినల్ నిర్మించి, 500 డొమెస్టిక్ పాసింజర్లు, 200 ఇంటర్నేషనల్ పాసింజర్ల సామర్థ్యానికి పెంచుతూ ఏర్పాట్లు చేశామన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టును సైతం అభివృద్ధి చేసినట్టు తెలిపారు.