బిజినెస్

ఆందోళనలో ఎఫ్‌పిఐలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: భారత్ ఈ వారం మారిషస్‌తో పన్ను సవరణ ఒప్పందంపై సంతకం చేయడం పట్ల విదేశీ పోర్ట్ఫులియో మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎఫ్‌పిఐ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించి వారి ఆందోళనలపై చర్చించింది. విదేశీ పోర్ట్ఫులియో మదుపరులు గురువారం రెవెన్యూ విభాగ కార్యదర్శి హస్ముక్ అధియాతో సమావేశమై తమ ఆందోళనలతో పాటు ‘గార్’ (జనరల్ యాంటీ ఎవైడెన్స్ రూల్స్), పన్ను ఒప్పందాలకు సంబంధించిన ఇబ్బందులపై విస్తృత చర్చలు జరిపారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ట్వీట్ చేశారు. పార్టిసిపేటరీ నోట్స్ (పి-నోట్స్)పై పన్నులు విధించడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని, మారిషస్‌తో భారత్ పన్ను సవరణ ఒప్పందంపై సంతకం చేయడం వలన పన్నుల చట్టాలు బలహీనంగా ఉన్న సింగపూర్, సైప్రస్ లాంటి దేశాల నుంచి పెట్టుబడులు వెల్లువెత్తుతాయని పన్ను నిపుణులు ఆందోళనలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమలులోకి రానున్న ‘గార్’ను కూడా వీరు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు కూడా. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అప్రమత్తమై ఎఫ్‌పిఐ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించింది. కాగా, భారత్‌కు వచ్చే విదేశీ పెట్టుబడుల్లో ఎక్కువ మొత్తం మారిషస్ ద్వారానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంతో పన్ను ఒప్పందాన్ని సవరించుకోవడం వలన భారత్‌పై గణనీయ ప్రభావం పడుతుంది. మారిషస్‌తో మూడు దశాబ్దాల నుంచి కొనసాగుతున్న ద్వంద్వ పన్నుల నిరోధక ఒప్పందాన్ని సుదీర్ఘ చర్చల తర్వాత భారత్ సవరించుకుంది. పన్ను ఎగవేతలతోపాటు పెట్టుబడుల దారి మళ్లింపును నిరోధించాలన్న ప్రధాన లక్ష్యంతో భారత్ ఈ ఒప్పందాన్ని సవరించుకుంది. 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే ఈ సవరణ ఒప్పందం ప్రకారం మారిషస్ గుండా భారత్‌లో పెట్టుబడులను మళ్లించే సంస్థలు రెండేళ్లపాటు అప్పటి రేటు ప్రకారం స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌లో సగం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 15 శాతంగా ఉన్న ఈ పన్ను మొత్తం రేటు 2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.