బిజినెస్

‘బ్రాహ్మణుల సంక్షేమానికి పథకాలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: ఆంధ్రప్రదేశ్‌లో బ్రాహ్మణుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు కీలక పథకాలను అమలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. గాయత్రీ పథకం, వశిష్ట పథకం, గరుడ పథకం పేరిట మూడు పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.
గాయత్రీ పథకం ద్వారా పాఠశాలలు, కాలేజీలు, యూనివర్శిటీల్లో టాపర్లుగా వచ్చిన వారికి నగదు బహుమతి అందిస్తున్నామని, వశిష్ట పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ప్రవేశపరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నామని, గరుడ పథకం కింద పేద బ్రాహ్మణ కుటుంబ సభ్యులకు 10 వేల రూపాయిల వరకూ ఆర్థిక సాయం అందిస్తామని ఆయన వివరించారు. ఇతర వివరాలకు ఆంధ్రాబ్రాహ్మిణ్ డాట్ ఎపి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.