బిజినెస్

సామాన్యుడిపైనే భారమెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: పెట్రోలియం ఉత్తత్తులపై వచ్చే ఆదాయాన్ని వౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఉపయోగించే ప్రభుత్వ విధానాన్ని యుపిఏ ప్రభుత్వంలో పెట్రోలియం శాఖ మంత్రిగా పని చేసిన ఎస్ జైపాల్ రెడ్డి తప్పుబట్టారు. డీజిల్, పెట్రోలు ధరల పెరుగుదల మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆయన అన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం చేపట్టే భారీ ప్రాజెక్టులకోసం పెట్రోలియం ఉత్పత్తిదారులు మాత్రమే ఎందుకు చెల్లించాలి?’ అని మంగళవారం పిటిఐతో మాట్లాడుతూ ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్యాస్ సబ్సిడీపై ప్రభుత్వం లక్షా 20 వేల కోట్లు ఖర్చు చేసేదని, అదే ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ 40 వేల కోట్లు మాత్రమే ఉందని ఆయన చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వానికి దాదాపు లక్షన్నర కోట్లు ఆదా అవుతున్నా ఇంత తక్కువ సబ్సిడీ ఇస్తోందన్నారు. ‘పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల భారాన్నంతా మధ్యతరగతి వారే ఎందుకు మోయాలి?’ అని కూడా ఆయన ప్రశ్నించారు. ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం ద్వారా వినియోగదారులకు ప్రయోజనం కల్పించాలని కూడా ఆయన గట్టిగా కోరారు. కాగా, పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తేవాలనడం అభిలషణీయమే కానీ రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తాయి గనుక ఇది ఆచరణ సాధ్యం కాదని జైపాల్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తెచ్చే అంశాన్ని జిఎస్‌టి కౌన్సిల్ పరిశీలించాల్సిన సమయం వచ్చిందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యల గురించి అడగ్గా, జిఎస్‌టి కౌన్సిల్ దీన్ని చేర్చదనే విషయం ఎన్డీఏ ప్రభుత్వానికి బాగా తెలుసునని, ఎందుకంటే రాష్ట్రాలు దీనికి ససేమిరా అంగీకరించవని జైపాల్‌రెడ్డి అభిప్రాయ పడ్డారు.