బిజినెస్

ప్రధాని ఆర్థిక సమీక్ష వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: దేశ ఆర్థిక వృద్ధి మందగించడానికికారణాలు, దాన్ని సరిదిద్దడానికి పరిష్కార మార్గాలను సూచిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక సమగ్ర ప్రజెంటేషన్‌ను రూపొందించే పని ఇంకా పూర్తి కాకపోవడంతో దేశ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి ఆర్థిక మంత్రి, ఆ ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జరపాల్సిన సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి దేశ ఆర్థిక పరిస్థితిని సమీక్షించి, దాన్ని మెరుగుపర్చడానికి ఉన్న మార్గాలను అనే్వషించడం కోసం ప్రధాని ఈ రోజు సాయంత్రం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ఆర్థిక శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కావలసి ఉండింది. అయితే ఈ సమావేశాన్ని కొద్ది రోజుల పాటు వాయిదా వేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
కొత్త తేదీలను ఇంకా నిర్ణయించలేదు. ప్రభుత్వ రెవిన్యూలు, వ్యయాన్ని పెంచడంతో పాటుగా జిడిపి వృద్ధి తగ్గుదలను ఆపడానికి తీసుకోవడంపై ఒక సమగ్ర నివేదికను రూపొందించడానికి కీలక మంత్రిత్వ శాఖలతో చర్చలు జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక శాఖను కోరిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పెట్టుబడి అవసరాలు లాంటి వాటిని అంచనా వేయడానికి సోమవారం రైల్వేలులాంటి కొన్ని మంత్రిత్వ శాఖలతో చర్చలు జరిగాయి. త్వరలోనే మరిన్ని సమావేశాలు కూడా జరగనున్నాయి. దేశ అర్థిక రంగం ఎదుర్కొంటున్న వ్యవస్థాగతమైన లోపాలకు, అలాగే వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) అమలులో ఎదురవుతున్న ప్రాథమిక సమస్యలకు తక్షణం చెక్ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. జిఎస్‌టిని అమలు చేయడం వల్ల దేశ ఆర్థిక వృద్ధి 2 శాతం మేర పెరుగుతుందని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే ఇది అమలయిన తర్వాత తొలి రెండు నెలల్లో సాంకేతికంగా ఎదురయిన ఇబ్బందుల కారణంగా వాస్తవానికి ప్రభుత్వ ఆదాయం తగ్గింది. అలాగే ఎగుమతులు మందగించడంతో పాటు ప్రైవేటు పెట్టుబడులు సైతం పుంజుకోకపోవడంతో వీలయినంత త్వరగా వీటికి చెక్ పెట్టాలని ప్రధానమంత్రి కార్యాలయం భావిస్తున్నట్లు కూడా ఆ వర్గాలు తెలిపాయి.