బిజినెస్

ఆ సొమ్మును పేదల సంక్షేమానికే వాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చిన సొమ్మును సమాజంలోని బలహీన వర్గాల సంక్షేమానికి ఉపయోగించాలని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. గత ఏడాది నవంబర్ 9న మోదీ ప్రభుత్వం వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత చెలామణిలో ఉన్న పెద్ద నోట్లలో 99 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి రావడాన్ని ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. బెడ్‌రూమ్‌ల్లో, బాత్ రూమ్‌లలో, దిండ్లకింద దాగి ఉండడానికి బదులు ఈ సొమ్ము తిరిగి వ్యవస్థలోకి రావడం మంచిది కాదా? నిజానికి ఇది సంతోషించదగ్గ విషయం’ అని ఆయన అన్నారు. అయితే బ్యాంకులకు చేరిన సొమ్మును సమాజంలోని బలహీన వర్గాలకు చేరాలని, ప్రభుత్వం దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని బుధవారం ఇక్కడ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల సదస్సులో మాట్లాడుతూ వెంకయ్యనాయుడు అన్నారు.
పేదలకు అప్పులు ఇస్తే వాళ్లు తిరిగి చెల్లించరనే అపోహ ఉందని, నిజానికి సంపన్నులే పన్నులు ఎగవేస్తారనే విషయం మనందరికీ తెలుసునని విజయ్ మాల్యా లాంటి పారిశ్రామికవేత్తలు రుణాలను ఎగవేయడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన అన్నారు. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ అనేది శుష్కనినాదం కాదని, సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందేలా చూడడానికి దీర్ఘకాలిక మహుముఖ ప్రణాళికను అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కేవలం రిజర్వేషన్లు, స్కూళ్లలో ప్రవేశాలు లేదా ఉద్యోగాలు కల్పించినంత మాత్రాన చాలదని, సమాజంలోని అణగారిన వర్గాలను కూడా కలుపుకొని పోయి వారికి తోడ్పాటు అందించాలని, లేదంటే పేదలు, ధనికులకు మధ్య అంతరాలు మరింతగా పెరిగిపోతాయన్నారు. ఎస్సీలు, ఎస్టీలకు చెందిన పరిశ్రమలనుంచి తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేలా ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలను, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. 2012లోనే ప్రభుత్వ సేకరణ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీలకు చెందిన పరిశ్రమలనుంచి అరశాతంకన్నా తక్కువ వస్తువులను ఎందుకు కొంటున్నారో కారణాలను ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. మన దేశంలో రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలను, వ్యాపారవేత్తలను కలుసుకోవడానికి ఇష్టపడరని, వాళ్లను పగటి పూటకాకుండా రాత్రిపూట మాత్రమే కలుస్తూ ఉంటారని ఉపరాష్టప్రతి అన్నప్పుడు నవ్వులు పూశాయి. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా, గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరమ్ కూడా పాల్గొన్నారు.