బిజినెస్

రెండూరోజూ బలహీనంగా మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం వరసగా రెండోరోజు కూడా బలహీనంగా ముగిశాయి. విదేశీ మార్కెట్లలో ఊగిసలాట దోరణికితోడు అందరి దృష్టి కూడా అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంపైనే ఉండడంతో మదుపరులు కొనుగోళ్లకు దూరంగా ఉండిపోయారు. దీనికితోడు ఐక్యరాజ్య సమితిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగం ప్రభావం కూడా మార్కెట్లపై కనిపించింది.
నిన్నటి ముగింపుకన్నా పైస్థాయిలో మొదలైన బిఎస్‌ఇ సెనె్సక్స్ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకొని చివరికి దాదాపు 2 పాయింట్ల నష్టంతో 32,400.51 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 6.40 పాయింట్లు కోల్పోయి 10,141.15 పాయింట్ల వద్ద ముగిసింది. మొబైల్ ఇంటర్‌కనెక్షన్ యూజర్ చార్జీలను సగానికిపైగా తగ్గిస్తున్నట్లు ట్రాయ్ ప్రకటించిన నేపథ్యంలో ఐడియా సెల్యులార్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలీ సర్వీసెస్ లాంటి ప్రధాన టెలికాం కంపెనీల షేర్లు దాదాపు 3.43 శాతం దాకా నష్టపోయాయి. అయితే భారతీ ఎయిర్‌టెల్ మాత్రం చివర్లో కొనుగోళ్ల మద్దతుతో స్వల్ప లాభాలతో ముగిసింది. ఈ నిర్ణయంతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రియలన్స్ జియో భారీగా లాభపడవచ్చన్న అంచనాలతో ఆ సంస్థ షేరు 0.85 శాతం మేర లాభపడింది. కాగా. అమ్మకాల ఒత్తిడితో హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, సన్‌ఫార్మా, హిందుస్థాన్ యూనిలీవర్, పవర్‌గ్రిడ్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి ప్రధాన షేర్లు నష్టపోయాయి. అయితే డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్ షేర్లు మంచి లాభాలు ఆర్జించాయి.