బిజినెస్

ఏపి జెన్‌కో థర్మల్ కేంద్రానికి ఆగిన బొగ్గు సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్తుకూరు, మే 19: నెల్లూరు జిల్లా ముత్తుకూరు వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థ దామోదరం సంజీవయ్య ఎపి జెన్‌కో థర్మల్ కేంద్రంలో రెండు యూనిట్లకు సంబంధించి గురువారం విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ప్రాజెక్టులోని బంకర్‌లోని 2ఎ వద్ద కనే్వయర్ బెల్టు తెగిపోయి పలు సాంకేతిక లోపాలు ఏర్పడటంతో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. బొగ్గు రవాణా ప్రక్రియకు ఆటంకం కలిగి ఈ పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న ప్రాజెక్టు డైరెక్టర్ సుందర్ సింగ్ తెగిన కన్వర్ట్ బెల్టు ప్రదేశాన్ని పరిశీలించారు. దీనికిగల కారణాలు ఏమిటని ప్రాజెక్టు ఇంజనీర్లను ఆరాతీశారు. ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణరావుతో ఈ విషయంపై చర్చించారు. ఎపి జెన్‌కో ఇంజనీర్ల బృందం మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. ఇంకా పనులు కొనసాగుతునే ఉన్నాయి. సాంకేతిక లోపాల కారణాలపై కొంత మంది ఇంజనీర్లపై ప్రాజెక్టు డైరెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అధికారుల నిర్లక్ష్యం వల్లే కనే్వయర్ బెల్టు తెగిందని డైరెక్టర్ జెన్‌కో అధికారులను అన్నట్లు తెలుస్తోంది.