బిజినెస్

విశాఖ జిల్లాలో డూన్ స్కూల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: ఆంధ్రప్రదేశ్‌లో డూన్ స్కూల్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. డూన్ స్కూల్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. డూన్ స్కూల్‌ను విశాఖ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే బావుంటుందనే అంశంలో మంత్రి గంటా శ్రీనివాసరావు వారితో చర్చించారు. డూన్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే తీసుకోవల్సిన జాగ్రత్తలు, ఇతర వౌలిక సదుపాయాల గురించి ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇండియన్ పబ్లిక్ స్కూల్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డూన్ స్కూల్‌కు ప్రపంచంలోనే అత్యుత్తమ పాఠశాలగా నాలుగో స్థానం దక్కిందని వారు మంత్రికి వివరించారు. ఎపి విభజనానంతరం డూన్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవ తీసుకుని డూన్ ప్రతినిధులతో మాట్లాడటంతో ఒక ప్రతినిధి బృందం వచ్చి మంత్రిని కలిసి చర్చించింది. ఈ సమావేశంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆర్ పి సిసోడియా, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.