బిజినెస్

ఈ ఏడాది వృద్ధిరేటు 7.5 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: దేశంలో వస్తు వినిమయం క్రమేణా పెరుగుతుండటంతో ప్రస్తుత సంవత్సరంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికాభివృద్ధి రేటు 7.5 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మూడీస్ ఇనె్వస్టర్ సర్వీస్ గురువారం వెల్లడించింది. అయితే ప్రైవేటు పెట్టుబడులు నిలకడగా పెరగడంపైనే ఇది ఆధారపడి ఉంటుందని మూడీస్ స్పష్టం చేసింది. గత (2015-16) ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.3 శాతం వృద్ధిరేటును సాధించిన విషయం విదితమే. అయితే దేశంలో ప్రైవేటు పెట్టుబడులు ఇప్పటికీ బలహీనంగానే ఉన్నాయని మూడీస్ అభిప్రాయపడింది. ‘పెద్ద మొత్తంలో సరుకులను దిగుమతి చేసుకునే దేశంగా భారత ఆర్థిక వ్యవస్థకు ధరల తగ్గుదలతో పాటు వస్తు వినియోగం పెరగడం వలన ఎంతో ప్రయోజనం చేకూరింది. ఈ అభివృద్ధి స్థిరంగా ముందుకు సాగాలంటే దేశీయంగా ప్రైవేటు పెట్టుబడులు నిలకడగా పెరగాల్సిన అవసరం ఉంది’ అని 2016-17 సంవత్సరానికి సంబంధించిన ప్రపంచ స్థూల ఆర్థిక స్థితిగతుల నివేదిక (గ్లోబల్ మాక్రో ఔట్‌లుక్ 2016-17)లో మూడీస్ పేర్కొంది. వస్తు ఎగుమతులు తక్కువగానూ, దిగుమతులు ఎక్కువగానూ ఉండటం భారత ఆర్థిక వ్యవస్థకు బాహ్య ఒడిదుడుకుల నుంచి కొంత మేరకు రక్షణ కల్పిస్తున్నాయని, కనుక 2015-16లో 7.3 శాతంగా ఉన్న భారత వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా పుంజుకుని 7.5 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నామని మూడీస్ వివరించింది.