బిజినెస్

నేడు ఎస్‌బిఐ అనుబంధ బ్యాంకుల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)కి చెందిన ఐదు అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు శుక్రవారం సమ్మె నిర్వహించనున్నారు. మాతృ సంస్థలో తమ బ్యాంకులను విలీనం చేయాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఈ సమ్మె చేపడుతున్నట్లు వారు స్పష్టం చేశారు. ఇటీవల కొత్తగా ఏర్పాటైన భారతీయ మహిళా బ్యాంకుతో పాటు ఐదు అనుబంధ బ్యాంకులను స్టేట్ బ్యాంకులో విలీనం చేయాలని ఎస్‌బిఐ ఈ వారం ఆరంభంలో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఎఐబిఇఎ (అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం)కి చెందిన డైరెక్టర్లతో పాటు మరికొంత మంది స్వతంత్ర డైరెక్టర్లు, ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటకీ ఈ ప్రతిపాదనను, అందుకు అనుసరించే పద్ధతులను ఆమోదించి విలీనానికి తీర్మానం చేశారని, దీంతో ఐదు అనుబంధ బ్యాంకుల్లోని తమ సభ్యులతో చర్చించి శుక్రవారం సమ్మె నిర్వహించాలని నిర్ణయించామని ఎఐబిఇఎ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. శుక్రవారం సమ్మెకు దిగనున్న ఎస్‌బిఐ అనుబంధ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఉన్నాయి. ఎఐబిఇఎకి అనుబంధంగా పనిచేస్తున్న ఎస్‌ఎస్‌బిఇఎ (స్టేట్ సెక్టార్ బ్యాంక్ ఎంప్లారుూస్ అసోసియేషన్) పిలుపు మేరకు శుక్రవారం తాము సమ్మె నిర్వహిస్తున్నందున బ్యాంకింగ్ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందని ఈ బ్యాంకులు ఇప్పటికే తమతమ ఖాతాదారులకు తెలియజేశాయి.