బిజినెస్

కెటిఆర్ చెప్పిన బిగ్ న్యూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: రెండు రోజుల్లో మీతో ఒక పెద్ద వార్త పంచుకుంటాను అని రెండు రోజుల క్రితం ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్‌లో పేర్కొనడం చర్చనియాంశంగా మారింది. మీడియాలో కొందరు బిగ్ న్యూస్ అనే పదాన్ని సంచలన వార్త అని అనువాదం చేయడంతో రాజకీయంగా ఏదైనా జరుగుతుందేమో అంటూ సామాజిక మాధ్యమాల్లో బోలెడు చర్చ జరిగింది. అయతే ఏమిటా బిగ్ న్యూస్? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారో చెబుతారా? అంటూ కొంత మంది ట్విట్టర్‌లో కెటిఆర్‌ను ప్రశ్నించారు. దీంతో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారో నా స్నేహితుడు రానా చెబుతాడు అని కెటిఆర్ ట్విట్టర్‌లో సమాధానం ఇవ్వడంతో రానా స్పందించారు. అయితే మొదటి రోజే చాలా మంది కెటిఆర్ ట్విట్ చేసిన బిగ్ న్యూస్ ఆపిల్ సిఇఓ రాక గురించి అని ఊహించారు. ఊహించినట్టుగానే ఆపిల్ సిఇఓ హైదరాబాద్‌కు రావడం ఆపిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు ప్రారంభోత్సవం చేయడం గురించే ఆ బిగ్ న్యూస్ అని కెటిఆర్ ఈరోజు ట్విట్టర్‌లో ప్రకటించారు.

చిత్రం హైదరాబాద్‌లో గురువారం తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌తో కలసి స్మార్‌ట్రాన్ ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్