బిజినెస్

బజాజ్ ‘వి’ బైక్ వచ్చేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సోమవారం తమ ప్రతిష్ఠాత్మక 150 సిసి బైక్ ‘వి’ని ఆవిష్కరించింది. భారత తొలి యుద్ధవిమాన నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ నుంచి తీసిన లోహంతో ఈ బైక్‌లను బజాజ్ తయారు చేస్తున్నది తెలిసిందే. కాగా, ఈ బైక్ అమ్మకాలు వచ్చే నెల మార్చి నుంచి మొదలవనుండగా, అప్పుడే దీని ధరను బజాజ్ ప్రకటించనుంది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం 60,000 రూపాయల నుంచి 70,000 రూపాయల వరకు బైక్ ధర ఉండే అవకాశాలు ఉన్నాయి. తొలుత నెలకు 20 వేల యూనిట్లను తయారు చేస్తామని, ఆ తర్వాత డిమాండ్ పెరిగితే మరిన్ని తయారు చేస్తామని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ క్రమంలోనే బైక్ ధరపై మాట్లాడుతూ దాదాపు 60-70 వేల రూపాయలు ఉండవచ్చన్నారు. కాగా, మోటార్‌సైకిళ్ల రంగంలో బజాజ్ వి ఓ నూతన అధ్యాయానికి తెరతీస్తుందని బజాజ్ ఆటో అధ్యక్షుడు (మోటార్‌సైకిల్ వ్యాపారం) ఎరిక్ వ్యాస్ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను హెచ్‌ఎమ్‌ఎస్ హెర్క్యులస్ పేరుతో బ్రిటన్ రూపొందించగా, దీన్ని 1957లో భారత్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత దీనికి ఐఎన్‌ఎస్ విక్రాంత్‌గా నామకరణం చేశారు. సంస్కృత పదం ‘విక్రాంత’ నుంచి విక్రాంత్ పేరును తీసుకున్నారు. 1961 మార్చి 4న భారత నావికాదళ తొలి యుద్ధవిమాన నౌకగా మొదలైన ఐఎన్‌ఎస్ విక్రాంత్ పయనం.. 1997 జనవరి 31 వరకు సాగింది. ఆ తర్వాత 2012 వరకు ఓ మ్యూజియంగా సేవలందించిన విక్రాంత్.. 2014 నవంబర్‌లో స్క్రాప్ మెటల్‌గా మారిపోయింది. నావికాదళం నుంచి దీన్ని బజాజ్ ఆటో కొనుగోలు చేయగా, విక్రాంత్‌లో ఉన్న టన్నులకొద్దీ లోహంతో మోటార్‌సైకిళ్లను తయారు చేయడం ప్రారంభించింది. ఈ మోటార్‌సైకిల్‌నే ‘వి’ పేరుతో ఇప్పుడు బజాజ్.. దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది.
chitram...

భారత తొలి యుద్ధవిమాన నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ లోహంతో బజాజ్ ఆటో తయారుచేసిన ‘వి’ బైక్ ఇదే. సోమవారం న్యూఢిల్లీలో సంస్థ
మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ దీన్ని ఆవిష్కరించారు