బిజినెస్

భారత్‌లో తయారీకి యాపిల్ ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 21: భారత్‌లో యాపిల్ ఉత్పత్తులను తయారు చేసేందుకు ఆసక్తి కనబరిచారు ఆ సంస్థ సిఇఒ టిమ్ కుక్. ఈ గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం సారథి.. భారత్‌లో తొలిసారిగా పర్యటిస్తుండగా, శనివారం ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన భేటీలో దేశీయ అమ్మకాలకు సరిపడా సంస్థ ఉత్పత్తులను ఇక్కడే తయారు చేయాలనుకుంటున్నామని మోదీకి కుక్ తెలిపారు. అందుకున్న అవకాశాలపై ఇరువురు చర్చించారు. భారత్‌లోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు. సైబర్-సెక్యూరిటీ, డేటా ఎన్‌క్రిప్షన్‌కు సంబంధించిన అంశాలూ మోదీ-కుక్ చర్చలో ప్రస్తావనకు వచ్చాయి. ‘్భరత్‌లో యాపిల్ భవిష్యత్ కార్యచరణను ప్రధాని మోదీకి కుక్ వివరించారు. యాపిల్ ఉత్పత్తుల తయారీ, రిటైలింగ్ అవకాశాలపై మాట్లాడారు. భారత్‌లో నైపుణ్యం కలిగిన యువత ఉందని, అలాంటి యువత అవసరం యాపిల్‌కు ఎంతో ఉందని కుక్ అన్నారు.’ అని మోదీ-కుక్ భేటీపై విడుదలైన ఓ అధికారిక ప్రకటన వెల్లడించింది. సైబర్ నేరాలతో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి దోహదపడాలని కుక్‌ను మోదీ కోరినట్లు తెలిపింది. ఇదిలావుంటే ఈ సమావేశం సందర్భంగా కుక్.. ఓ అప్‌డేట్ వెర్షన్ ‘నరేంద్ర మోదీ మొబైల్ యాప్’ను ప్రారంభించారు. సమావేశం అనంతరం మోదీ.. కుక్‌తో కలిసి దిగిన ఫోటోలను ట్విట్టర్‌లో పెట్టారు. మోదీ రాకపట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘్థంక్యూ టిమ్ కుక్’ అనే సందేశాన్ని పోస్ట్ చేశారు. దీనిపై కుక్ కూడా ‘ఓ గొప్ప సమావేశానికి కారణమైన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు’ అని స్పందించారు. ప్రధాన మంత్రి మోదీ చేపట్టిన ‘డిజిటల్ ఇండియా’, ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్టార్టప్ ఇండియా’, ‘స్వచ్ఛ్ భారత్’లను కొనియాడారు. కాగా, తన ఈ పర్యటన సందర్భంగా ఇప్పటికే హైదరాబాద్‌లో యాపిల్ మ్యాపింగ్ సెంటర్‌ను ప్రారంభించిన కుక్.. బెంగళూరులో ఓ యాప్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వచ్చిన దగ్గర్నుంచి బిజిబిజిగా గడుపుతున్న కుక్.. ముంబయిలోని ప్రఖ్యాత సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా అనుకోకుండా ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీని కలుసుకున్న కుక్.. హైదరాబాద్‌లో గోల్కొండ కోటనూ సందర్శించారు. కాన్పూర్‌లో ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌నూ తిలకించారు. ఇక కార్పొరేట్ ప్రముఖులతోనూ కుక్ సమావేశమయ్యారు. ముంబయిలోని దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన కుక్.. అక్కడ ఎండి, సిఇఒ చందా కొచ్చర్‌ను కలుసుకున్నారు. భారతీ ఎయిర్‌టెల్ అధిపతి సునీల్ మిట్టల్‌తో దేశంలో టెలికామ్ రంగ అభివృద్ధి, అవకాశాలు, 4జి సేవల విస్తరణపై చర్చించారు. టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్ర్తితోనూ, టిసిఎస్ సిఇఒ ఎన్ చంద్రశేఖరన్‌తోనూ కుక్ సమావేశమయ్యారు. బాలీవుడ్ ప్రముఖలనూ కలుసుకున్నారు. అమెరికాకు చెందిన యాపిల్ సంస్థ.. ఐఫోన్, మ్యాక్ కంప్యూటర్స్, డిజిటల్ వాచ్‌లను తయారు చేస్తోంది. స్మార్ట్ఫోన్ అమ్మకాల్లో ప్రపంచంలోనే అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో భారత మార్కెట్‌లో పాగా వేసేందుకు కుక్ చేపట్టిన ఈ పర్యటన దోహదపడగలదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చిత్రం శనివారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన యాపిల్ సిఇఒ టిమ్ కుక్