బిజినెస్

మోర్ మెగా స్టోర్‌తో ఆజాఫ్రాన్ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: ప్రముఖ ఆర్గానిక్ పర్సనల్ కేర్ ఉత్పాదనల తయారీ కంపెనీ ఆజాఫ్రాన్ ఇన్నోవేషన్ కంపెనీ ప్రముఖ రిటైల్ చైన్ మార్కెట్ కంపెనీ మోర్ మెగా స్టోర్‌తో ఒప్పందం చేసుకుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మోర్ మెగా స్టోర్‌లో ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయించడం ద్వారా రిటైల్ మార్కెట్‌ను మరింత విస్తత్రం చేస్తున్నట్లు తెలిపింది. ఆజాఫ్రాన్ ఇన్నోవేషన్ లిమిటెడ్ బిజినెస్ హెడ్ టిఆర్.సురేష్ మాట్లాడుతూ ,దక్షిణాదిలో ఆర్గానిక్ పర్సనల్ కేర్ ఉత్పాదనలకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. 2018 నాటికి దేశ వ్యాప్తంగా ఆర్గానిక్ ఉత్పాదనల డిమాండ్ 13.2 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసినట్లు చెప్పారు. ఆదిత్య బిర్లాకు ప్రస్తుతం బెంగళూరులో 11, హైదరాబాద్‌లో 3, ఢిల్లీ, ముంబయి, మైసూర్ ఇండోర్‌లో ఒక్కోటి కలిపి మొత్తం 20 మోర్ మెగా స్టోర్స్ ఉన్నాయని తెలిపారు.