బిజినెస్

వేలాన్ని అడ్డుకుంటే జైలుకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: అంబీ వ్యాలీ వద్ద శాంతి, భద్రతల సమస్యను ప్రస్తావిస్తూ పుణె పోలీసులకు సహారా గ్రూపు లేఖ రాయడంపై సుప్రీం కోర్టు గురువారం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. సహారా గ్రూపునకు చెందిన అంబీ వ్యాలీని వేలం వేసేందుకు న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రక్రియ సాగుతున్న విషయం తెలిసిందే. అయితే సహారా గ్రూపు లేఖ విషయమై సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా) చేసిన ఆరోపణను జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. అంబీ వ్యాలీని వేలం వేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించినందున ఈ వ్యవహారంలో సహారా గ్రూపు పుణె రూరల్ ఎస్‌పికి లేఖ రాయకుండా ఉండాల్సిందని ధర్మాసనం పేర్కొంది. ఈ ధర్మాసనంలో జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎకె.సిక్రి కూడా సభ్యులుగా ఉన్నారు. బాంబే హైకోర్టు నియమించిన అధికారిక లిక్విడేటర్‌కు 48 గంటల వ్యవధిలోగా అంబీ వ్యాలీని స్వాధీనపర్చేలా చూడాలని ఈ ధర్మాసనం మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)ని ఈ ధర్మాసనం ఆదేశించింది. అంబీ వ్యాలీని వేలం వేసే ప్రక్రియకు ఎవరైనా అవరోధం కలిగించినట్లయితే వారిని కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు పరిగణించి జైలుకు పంపించడం జరుగుతుందని ధర్మాసనం హెచ్చరించింది. సహారా గ్రూపు న్యాయవాది ప్రత్యక్ష పర్యవేక్షణలో అంబీ వ్యాలీ వేలం ప్రక్రియను కొనసాగించాలని బాంబే హైకోర్టు లిక్విడేటర్‌కు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ విషయంలో అవసరమైతే బాంబే హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఎఎస్.ఓకా నుంచి సలహాలు, సూచనలు పొందాలని లిక్విడేటర్‌కు సూచించింది.
అంతకుముందు ఈ వ్యవహారంలో సెబీ తరపు న్యాయవాది అరవింద్ దతర్ వాదన వినిపిస్తూ, పుణె రూరల్ ఎస్‌పికి సహారా గ్రూపు లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ లేఖతో పోలీసులు అంబీ వ్యాలీని తమ ఆధీనంలోకి తీసుకున్నారని ఆయన సుప్రీం కోర్టు ధర్మాసనానికి వివరించారు. అయితే ఈ వాదనను సహారా గ్రూపు తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తోసిపుచ్చారు. అంబీ వ్యాలీ సంరక్షణ బాధ్యతను పోలీసులకు అప్పగించలేదని, ఈ విషయంలో ప్రతివాదులు తప్పుడు ఆరోపణలు చేస్తూ న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వాద, ప్రతివాదనలను విన్న అనంతరం ధర్మాసనం స్పందిస్తూ, కోర్టు ధిక్కరణ కింద ప్రస్తుత దశలో ఎటువంటి చర్యలూ చేపట్టడం లేదని తెలిపింది. అంబీ వ్యాలీని వేలం వేసే ప్రక్రియను సహారా గ్రూపు అడ్డుకుంటోందని, కనుక ఆ సంస్థపై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు చేపట్టాలని సెబీ విజ్ఞప్తి చేయడంతో ధర్మాసనం పై విషయాన్ని స్పష్టం చేసింది.

చిత్రం..పుణెలోని అంబీ వ్యాలీ