బిజినెస్

మార్కెట్ జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 12: గత మూడు నెలల్లో ఎన్నడూ లేని విధంగా సెనె్సక్స్ ఏకంగా 348 పాయింట్లు పుంజుకుంది. గురువారం జరిగిన లావాదేవీల్లో వివిధ దశల్లో ఊగిసలాడిన మార్కెట్ అంతిమంగా 32,182 పాయింట్ల వద్ద ముగిసింది. ముఖ్యంగా అమెరికా వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో మార్కెట్ ఆచితూచి ముందుకు సాగింది. అలాగే భారత రూపాయి కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే 6 పైసలు పెరిగి 65.08కి చేరుకుంది. అటు ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ కూడా 111.60 పాయింట్లు పెరిగి 10,096.40 పాయింట్లకు చేరుకుంది. మే 25 తర్వాత నిఫ్టీ ఇంత భారీగా పుంజుకోవడం ఇదే తొలిసారి. నేటి లావాదేవీల్లో మదుపుదారులు ఏకంగా 1.46 లక్షల కోట్ల రూపాయల మేర లాభపడ్డారు. బుధవారం 90 పాయింట్లు కోల్పోయిన సెనె్సక్స్ 24 గంటలు తిరగకుండానే అనూహ్య రీతిలో పుంజుకోవడానికి కారణం సర్వత్రా సానుకూల పరిస్థితులు నెలకొనడమే. పండుగల సీజన్ ఒక పక్క, మార్కెట్ నియంత్రణ సంస్థల సానుకూల ధోరణి మరో పక్క ఈ ఉత్సాహకరమైన వాతావరణానికి దోహదం చేశాయి. నేటి లావాదేవీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు విలువ 3.28 శాతం పెరిగి 872.50 రూపాయలకు చేరింది. అలాగే టిసిఎస్ షేరు విలువ కూడా 1.92 శాతం పుంజుకుని రూ.2,548.55కు చేరుకుంది. దేశీయ సంస్థాగత ఇనె్వస్టర్లు భారీగా కొనుగోళ్లు జరిపారు. దాదాపు 233.08 కోట్ల మేర వివిధ కంపెనీల షేర్లను కొన్నారు. సెనె్సక్స్ బలంగా పుంజుకోవడానికి సన్ ఫార్మా దోహదం చేసింది. యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీ లీవర్, హీరో మోటోకార్ప్ షేర్లు కూడా పుంజుకున్నాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేరు విలువ కూడా 1.47 శాతం మేర లాభపడింది.