బిజినెస్

ప్రథమార్థంలో రెండు రెట్లు పెరిగిన పుత్తడి దిగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రథమార్థం (ఏప్రిల్-సెప్టెంబర్)లో బంగారం దిగుమతులు రెండు రెట్లకు పైగా పెరిగి 16.95 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. బంగారం దిగుమతులు దేశ కరెంటు ఖాతా లోటు (సిఎడి)పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది రెండో త్రైమాసికం (ఏప్రిల్-సెప్టెంబర్)లో దేశంలోకి 6.88 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతులు జరిగాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో 1.80 బిలియన్ డాలర్లుగా ఉన్న బంగారం దిగుమతులు ఈ ఏడాది సెప్టెంబర్‌లో 5 శాతం తగ్గి 1.71 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దేశ వాణిజ్య లోటు 8.98 బిలియన్ డాలర్లకు తగ్గి ఏడు నెలల కనిష్ట స్థాయికి చేరుకునేందుకు ఇది దోహదం చేసింది. అయితే ఈ నెల నుంచి దేశంలో పండుగల సీజన్ ప్రారంభం కావడంతో బంగారం దిగుమతులు మరింత పెరుగడం ఖాయమని బులియన్ మార్కెట్ విశే్లషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో బంగారం దిగుమతులు పెరగడంతో జూన్ నెలాఖరు నాటికి కరెంటు ఖాతా లోటు 14.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో ఇది 2.4 శాతంగా ఉంది. కరెన్సీ రేటు విలువపై ప్రభావం చూపే విదేశీ మారకద్రవ్యం రాక, పోక మధ్య వ్యత్యాసానే్న కరెంటు ఖాతా లోటు అంటారు.