బిజినెస్

ప్రపంచానికే హార్టికల్చర్ హబ్‌గా ఏపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 23: ఈ ఏడాది రాష్ట్రంలో కోటి ఎకరాలకుపైగా ఉద్యానవన పంటలను సాగులోకి తీసుకొచ్చేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కనీసం 40 లక్షల ఎకరాల్లో హార్టీకల్చర్ పంటలను సాగులోకి తీసుకురావడం.. కోటీ 30 లక్షల ఎకరాల్లో ఇతర వ్యవసాయ పంటల సాగు ద్వారా వచ్చే ఆదాయంతో సరిసమానమవుతుందని చెప్పారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. స్థానిక లయోలా కాలేజీ ప్రాంగణంలో మూడురోజులు జరిగే రాష్ట్ర మొదటి హార్టికల్చర్ షో, మ్యాంగో ఫెస్టివల్-2016 రైతు మేళాను సోమవారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ధైర్యం చేయని విధంగా రుణమాఫీ ద్వారా రూ. 24వేల కోట్ల మేర రైతులకు రుణ విముక్తి కల్పించిన ప్రభుత్వం తమదేనని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశానికి, ప్రపంచానికే ఆదర్శంగా ‘హార్టికల్చర్ హబ్’గా రూపుదిద్దుతామని ప్రకటించారు. వ్యవసాయ రంగంలో, పండ్ల సాగులో విస్తీర్ణస్థాయి గణనీయంగా ఉన్నా నాణ్యత, తక్కువ దిగుబడి వంటి కారణాల వల్ల సరైన అంతర్జాతీయ మార్కెట్ ధరను పొందలేకపోతున్నామని ఆయన పేర్కొన్నారు. కాగా, హార్టికల్చర్ రైతుల రుణమాఫీపై పలువురు చేసిన విజ్ఞప్తులను, సూచనలను పరిగణనలోనికి తీసుకుని ఈ ఏడాది ప్రతి ఉద్యానవన రైతుకు రూ. 10వేల చొప్పున రుణమాఫీని వర్తింపచేశామని తెలిపారు. డెయిరీ, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం ద్వారానూ మంచి ఆదాయం సాధించాలని రైతులకు సూచించారు. రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్‌ను అందించగలుగుతున్నామని, నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యుత్ మోటార్లను సెల్‌ఫోన్ ద్వారా ఇంటి నుండే నియంత్రించే సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. మైక్రో న్యూట్రియన్స్ ద్వారా ఏ ప్రాంతాలు, ఏ పంటలకు అనువైనవో గుర్తించడం ద్వారా ఆ తరహా పంటలను సాగులోకి తీసుకొచ్చేలా రైతులకు సహకారం అందిస్తామన్నారు. ప్రపంచానికి హార్టికల్చర్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే దిశలో భాగంగా ఇక్కడ రైతులు పండించిన కూరగాయలు, పండ్లు, ఇతర ఉత్పత్తులను విమానాలు, ఓడలు, రైళ్లు, వాహనాల ద్వారా దేశీయంగా, విదేశీయంగా ఎగుమతికి తోడ్పాటు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలో 25 లక్షల హెక్టార్లలో హార్టికల్చర్ సాగు ద్వారా ఆ రంగాన్ని మరింత పటిష్టం చెయ్యాలన్నదే సిఎం ఆలోచన అన్నారు.

chitram హార్టికల్చర్ షో, మ్యాంగో ఫెస్టివల్‌లో పెద్దసైజు మామిడికాయను
ఆసక్తిగా చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు