బిజినెస్

మరింత ఉత్తేజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ఇటు నిఫ్టీ, అటు సెనె్సక్స్ మరింత బలాన్ని పుంజుకోవడం, అలాగే ఇతరత్రా చోటుచేసుకున్న సానుకూల పరిణామాల నేపథ్యంలో కొత్త వారంలో మార్కెట్ మరింతగా పరుగులుపెట్టే అవకాశం కనిపిస్తోంది. యాక్సిస్ బ్యాంక్, విప్రో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కూడా మార్కెట్‌ను కొత్త మలుపు తిప్పగలవని నిపుణలు చెబుతున్నారు. ఈ వారంలో దీపావళి కారణంగా గురువారం, శుక్రవారం మార్కెట్లకు సెలవే అయినప్పటికీ దీపావళి రోజు మాత్రం మూరత్ ట్రేడింగ్ కోసం స్టాక్ మార్కెట్ పనిచేస్తుంది. సెలవుల కారణంగా కొత్త వారంలో రెండు రోజుల పాటు మార్కెట్ పనిచేయదు కాబట్టి ఆర్థిక పరంగా అనూహ్య పరిణామాలేమీ చోటుచేసుకునే అవకాశం లేదు. చైనా స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) మూడో త్రైమాసిక ఫలితాలు మినహా ఈ వారంలో మార్కెట్‌ను ప్రభావితం చేసే పరిణామాలేవీ చోటుచేసుకోకపోవచ్చునని, అయితే మొత్తం మీద సానుకూలంగానే పరిస్థితులు కొనసాగే అవకాశం కనిపిస్తోందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌కు చెందిన వికె.శర్మ పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి స్థూల ధరల సూచీ, ద్రవ్యోల్బణ వివరాలు కూడా సోమవారం వెల్లడవుతున్నాయి. ఈ వారం కూడా వివిధ కంపెనీలు ప్రకటించే రెండో త్రైమాసిక ఫలితాలపైనే మార్కెట్ దృష్టి సారించే అవకాశం ఉంది. ఎసిసి, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలు జూలై-సెప్టెంబర్ ఆర్థిక ఫలితాల వివరాలను ఈ వారంలోనే వెల్లడించబోతున్నాయి. గత కొన్ని వారాల్లో ఎన్నడూ లేని స్థాయిలో సెనె్సక్స్ ఏకంగా 1.94 శాతం పెరిగి 618.47 పాయింట్ల బలాన్ని పుంజుకుంది. అలాగే ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ కూడా 1.88 శాతం అంటే 187.75 పాయింట్లు పెరిగింది. ఈ రెండు పరిణామాలు కొత్త వారంలో స్టాక్ మార్కెట్లు మరింత ఉత్తేజంగా దూసుకెళ్లడానికి తోడ్పడతాయని నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.