బిజినెస్

ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి పెట్టుబడుల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల న్యూఢిల్లీలో ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ ఈవెంట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఈ ఈవెంట్ ప్రారంభం కావడానికి ముందే దేశంలోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీల నుంచి హామీలు వచ్చాయని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ సోమవారం వెల్లడించారు. ఈ ఈవెంట్ ముగిసే నాటికి మరిన్ని పెట్టుబడులకు హామీలు వచ్చే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ ఈవెంట్‌లో 30 దేశాలు, అంతర్జాతీయ సంస్థలకు చెందిన 50 మందికి పైగా సిఇఓలతో పాటు దేశీయ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోని ప్రముఖ సంస్థలకు చెందిన సిఇఓలు, 27 రాష్ట్రాలు పాల్గొనబోతున్నట్లు ఆమె చెప్పారు. ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ ఈవెంట్ సందర్భంగా 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు హామీలు పొందాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్న తాము ఈ ఈవెంట్ ప్రారంభానికి ముందే ఈ లక్ష్యాన్ని సాధించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ఈవెంట్ ప్రారంభానికి ఇంకా రెండు మూడు వారాల సమయం ఉన్నందున మరిన్ని పెట్టుబడులకు హామీలు వచ్చే అవకాశం ఉందని ఆమె అన్నారు. అయితే దేశీయ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు హామీలిచ్చిన కంపెనీలు ఏవో వెల్లడించేందుకు ఆమె నిరాకరించారు. ఈ వివరాలను వెల్లడించేందుకు ఆయా కంపెనీల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉందని, ఈ అనుమతులు పొందిన తర్వాత ఆయా సంస్థల పేర్లను నవంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ ఈవెంట్‌లో వెల్లడిస్తామని ఆమె తెలిపారు.
ఇదిలావుంటే, ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో 24 స్టోర్లను నడుపుతున్న తాము 2020 నాటికి ఈ స్టోర్ల సంఖ్యను రెట్టింపు చేయాలని భావిస్తున్నట్లు మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వెల్లడించారు. భారత్ ఆఫర్ చేస్తున్న అవకాశాల గురించి ఐటిసి లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నకుల్ ఆనంద్, నెస్లే ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ ఖజూరియా, వాల్‌మార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రజనీష్ కుమార్, కెల్లాగ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మొహిత్ ఆనంద్ కూడా మాట్లాడినప్పటికీ దేశంలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనల గురించి వారు ఏమీ చెప్పలేదు.

చిత్రం..ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్