బిజినెస్

వృద్ధికి ఊతమిచ్చేందుకు ఉద్దీపనలు అవసరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ఆర్థిక ఉద్దీపనలను ప్రకటించాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ ఉద్ఘాటించారు. అయితే ఉత్పాతకతను, పెట్టుబడుల వ్యయాన్ని పెంపొందించుకునేందుకు మాత్రమే ఈ అదనపు నిధులను ఉపయోగించాలని ఆయన అన్నారు. ఆర్థిక వృద్ధిరేటు మందగించడంతో సమతమతమవుతున్న పారిశ్రామిక రంగం ఉద్దీపనల ప్యాకేజీ కోసం ప్రభుత్వంపై వత్తిడి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అయితే వృద్ధిరేటుకు ఊతమిచ్చేందుకు ఉద్దీపనలను ప్రకటించాల్సిందిగా తాను కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నానని, అయితే ఉత్పాతకతను, పెట్టుబడుల వ్యయాన్ని పెంపొందించుకునేందుకు మాత్రమే ఈ ఉద్దీపనలను ఉపయోగించేలా చూడాల్సిన అవసరం ఉందని పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ కుమార్ అన్నారు. వృద్ధిరేటుకు ఊతమిచ్చేందుకు పరిస్థితిని బట్టి స్పందిస్తానని, అంతేతప్ప ఆర్థిక ఉద్దీపనలను ప్రకటిస్తానని తాను ఎవరికీ హామీ ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేసిన నేపథ్యంలో రాజీవ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాషింగ్టన్‌లో ఆదివారం విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు జైట్లీ సమాధానమిస్తూ, ‘వృద్ధిరేటుకు ఊతమిచ్చే విషయమై పరిస్థితిని బట్టి మేము స్పందిస్తాం. అంతేతప్ప ఆర్థిక ఉద్దీపనలు అనే పదాన్ని నేను ఉపయోగించలేదు. నేను చెప్పిన స్పందన అనే మాటను ఉద్దీపనలుగా మీరు అర్ధం చేసుకున్నారు. కనుక ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది నేను కాదు. మీరే సమాధానం చెప్పాలి’ అని స్పష్టం చేశారు.

చిత్రం..నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్