బిజినెస్

దిగివచ్చిన ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: దేశంలో గత నెల టోకు ద్రవ్యోల్బణం 2.60 శాతానికి దిగివచ్చింది. ఆహార వస్తువులు, కూరగాయల ధరలు తగ్గడమే ఇందుకు కారణం. టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారంగా లెక్కించే ఈ ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఆగస్టు నెలలో 3.24 శాతానికి చేరుకుని నాలుగు నెలల గరిష్ట స్థాయిని తాకిన విషయం తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇది 1.36 శాతంగా ఉంది. ఆహార వస్తువులకు సంబంధించి ఈ ఏడాది ఆగస్టులో 5.75 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 2.04 శాతానికి, కూరగాయల ధరలు 44.91 శాతం నుంచి 15.48 శాతానికి తగ్గినట్లు సోమవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే గత నెలలో ఉల్లిపాయల ధరలు 77.78 శాతం పెరిగగా, గుడ్లు, మాంసం, చేపల ధరలు 5.47 శాతం పెరిగాయి. అలాగే ఆగస్టులో 2.45 శాతంగా ఉన్న తయారీ రంగ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో స్వల్పంగా 2.72 శాతానికి పెరగగా, ఆగస్టులో 9.99 శాతంగా ఉన్న ఇంధన, విద్యుత్ రంగ ద్రవ్యోల్బణం 9.01 శాతానికి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు క్రమంగా పెరుగుతుండటంతో దేశంలో గత రెండు నెలలు పెట్రోల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. అలాగే దేశీయంగా విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో పవర్ టారిఫ్‌లు ఆకాశాన్నంటాయి.
అయితే ఆగస్టు నెలలో 3.28 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లోనూ అదేవిధంగా ఉందని, కూరగాయలు, తృణ ధాన్యాల ధరలు తగ్గినప్పటికీ రిటైల్ ద్రవ్యోల్బణంలో ఎటువంటి మార్పు లేదని కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం వెల్లడించింది. మైనింగ్, విద్యుత్ రంగాల పనితీరు అద్భుతంగా ఉండటంతో ఆగస్టులో ఆగస్టులో పారిశ్రామిక వృద్ధిరేటు 4.3 శాతం పెరిగి తొమ్మిది నెలల గరిష్ట స్థాయికి చేరుకున్న విషయం విదితమే.
ద్రవ్య విధానంపై ఈ నెల ఆరంభంలో సమీక్ష జరిపిన రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయాందోళనతో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటు అంచనాను 6.7 శాతానికి తగ్గించింది. అలాగే గత ఆర్థిక సంవత్సర ద్వితీయార్థంలో 4 నుంచి 4.5 శాతం మధ్య నమోదైన ద్రవ్యోల్బణం ప్రస్తు ఆర్థిక సంవత్సర ద్వితీయార్థంలో 4.2 నుంచి 4.6 శాతం మధ్య నమోదవుతుందని రిజర్వు బ్యాంకు అంచనా వేసింది.