బిజినెస్

38 శాతం పెరిగిన యాక్సిస్ బ్యాంక్ నికర లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: సెప్టెంబర్ నెలతో ముగిసిన రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రైవేట్ సెక్టార్‌లోని ప్రధాన బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ మంగళవారం విడుదల చేసింది. రానిబాకీలు పెరిగినప్పటికీ తమ నికర లాభం 432 కోట్ల రూపాయలకు పెరిగిందని స్పష్టం చేసింది. అంటే నికర లాభాల్లో 38 శాతం వృద్ధిని సాధించినట్లు వెల్లడించింది. 2016-17 సంవత్సరానికి సంబంధించి జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో 319 కోట్ల నికర లాభం వచ్చినట్లు గతంలో యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. దానితో పోలిస్తే రానిబాకీలు పెరిగినప్పటికీ నికర లాభం ఏకంగా 432 కోట్లకు పెరిగినట్లు యాక్సిస్ బ్యాంక్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుత త్రైమాసికంలో స్థూల రానిబాకీలు 5.9 శాతానికి పెరిగాయని, గత ఏడాది ఇదే కాలంలో ఇవి 4.17 శాతం మేర ఉన్నట్లు వెల్లడించింది.