బిజినెస్

ఐటి విభాగం ఆన్‌లైన్ చాట్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన వౌలికమైన ప్రశ్నలు, సందేహాలు తీర్చేందుకు ఆదాయపు పన్ను విభాగం కొత్తగా ఆన్‌లైన్ చాట్ సర్వీసును ప్రవేశపెట్టింది. దీనిద్వారా ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన అన్ని రకాల ఇబ్బందులు, సమస్యలు, సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుందని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. ఆదాయపు పన్ను విభాగం వెబ్‌సైట్‌లో ఇందుకు సంబంధించిన విండోను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాధారణ పన్ను చెల్లింపుదారులకు ఎదురయ్యే అన్ని రకాల వౌలిక సందేహాలను తీర్చేందుకు ఆదాయపు పన్ను విభాగానికి చెందిన నిపుణులతోపాటు స్వతంత్రంగా ఆదాయపు పన్ను వ్యవహారాలను వృత్తిగా సేకరించే వ్యక్తులు కూడా ఇందులో అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకోసం ఈ రకమైన సర్వీసును ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారని, ఆ విధంగా తమ విభాగం ఈ సర్వీసును మరింత విస్తృతం చేస్తోందని తెలిపారు. ఆన్‌లైన్ సర్వీస్ ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి ఇతర అంశాలను కూడా ఇందులో చేరుస్తామని వెల్లడించిన ఆయన, ఇ-మెయిల్ ఐడి వివరాలు ఇవ్వడం ద్వారా ఏ వ్యక్తి అయినా కూడా ‘చాట్ రూము’లో ప్రవేశించవచ్చునని, ఓ అతిథిగా నిపుణుల నుంచి తన అనుమానాలను, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చునని తెలిపారు. ఈ వివరాలను తదుపరి రిఫరెన్స్‌గా కూడా ఆదాయం పన్ను చెల్లింపుదారులు ఉపయోగించుకునే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఈ చాట్‌లో వచ్చిన సమాధానాలన్నీ సదరు నిపుణుడి వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదాయపు విభాగం వివరణలుగా భావించకూడదని కూడా ఇందులో స్పష్టం చేసినట్లు తెలిపారు.