బిజినెస్

తగ్గిన కార్పొరేట్ ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, అక్టోబర్ 18: ఓ పక్క పెద్దనోట్ల రద్దు, మరోపక్క జిఎస్‌టి అమలుతో వ్యాపారపరంగా తీవ్రస్థాయిలో ఒడిదుడుకులను ఎదుర్కొన్న కార్పొరేట్ సంస్థలు సిబ్బందికి గిఫ్టులను ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన బడ్జెట్‌ను 35 నుంచి 40 శాతం వరకు కుదించుకున్నాయని, అందుకే ఈసారి దీపావళి బహుమతులు పేలవంగానే ఉండే అవకాశం ఉందని అసోచామ్ వెల్లడించింది. ఇందుకు సంబంధించి అనేక కార్పొరేట్ సంస్థల్లో సర్వే జరిపిన అసోచామ్ వృద్ధి, ఆర్థిక మాంద్య పరిస్థితులు, అమ్మకాలు తగ్గడం, డిమాండ్ పేలవంగా ఉండడం వంటి కారణంగా దీపావళి బహుమతుల విషయంలో గతంలో ఉన్నంత ఉత్సాహం కనిపించడం లేదని తెలిపింది. పెద్దనోట్ల రద్దు కారణంగా కార్పొరేట్ సంస్థల ఆదాయం తగ్గితే జిఎస్‌టి వల్ల మరింతగా ప్రతికూల ప్రభావం పడిందని అసోచామ్ తెలిపింది. అందుకే సిబ్బందికి గిఫ్టులు అందించే విషయంలో భారీగానే బడ్జెట్‌ను కుదించుకున్నాయని వెల్లడించింది. కేవలం సిబ్బందికే కాకుండా అనుబంధ సంస్థలు, భాగస్వామ్య పక్షాలు, ఇతర కీలక వ్యక్తులకు కార్పొరేట్ సంస్థలు దీపావళి బహుమతులను అందించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే అనేక కార్పొరేట్ సంస్థలపై రుణభారం పడడం వల్ల కూడా బోనస్ చెల్లింపులపై కూడా ప్రతికూల ప్రభావం కనిపిస్తోందని అసోచామ్ వెల్లడించింది. దీనివల్లే తమ ఆపరేషన్‌కు సంబంధించిన వ్యయాలను కూడా ఈ సంస్థలు గణనీయంగా తగ్గించుకున్నాయని స్పష్టం చేసింది. పెద్దనోట్ల రద్దు ఒక రకంగానూ, జిఎస్‌టి మరో రకంగానూ కార్పొరేట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీసాయని, దీని ప్రభావం అన్ని రకాలుగా ఈ సంస్థల కార్యకలాపాలపై పడుతోందని అసోచామ్ తెలిపింది. అలాగే దీపావళి బహుమతుల అమ్మకాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయని, ముఖ్యంగా చాక్లెట్లు, స్వీట్లు, కుకీలు సహా అనేక తినుబండారాల వ్యారాపాలు పర్వదిన సమయాల్లో భారీగానే పెరుగుతాయని, కానీ ఎఫ్‌ఎంజిసి సంస్థలు ఈసారి అనుకున్నట్టుగా అమ్మకాలు లేక డీలాపడుతున్నాయని కూడా అసోచామ్ వెల్లడించింది. అలాగే వాషింగ్‌మిషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎలక్ట్రిక్ స్టవ్‌లు ఇతర వినియోగ వస్తువుల అమ్మకాలు కూడా దారుణంగా పడిపోయాయని, పండగ వేళల్లో భారీగా సాగే స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు కూడా దెబ్బతిన్నాయని అసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్.రావత్ తెలిపారు. దాదాపు అన్ని కార్పొరేట్ సంస్థలు పర్వదినానికి సంబంధించిన వ్యయాల బడ్జెట్‌ను కుదించుకోవడంతోపాటు ఖర్చులనూ తగ్గించుకున్నాయంటే ఇటు పరిశ్రమల్లోనూ, అటు కార్పొరేట్ సంస్థల్లోనూ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఎంతగా దెబ్బతిన్నాయో అర్థమవుతోందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 758 కంపెనీలను తాను సర్వే చేశానని, ఇవన్నీ కూడా హైదరాబాద్, బెంగళూరు, జైపూర్, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో ఉన్నవేనని తెలిపారు.