బిజినెస్

ఆరు నెలల్లో 120 కోట్ల బంగారం అమ్మకాలు పేటియం వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ప్రారంభించిన ఆరు నెలల్లోనే పేటియం ద్వారా 120 కోట్ల రూపాయల మేర బంగారం లావాదేవీలు జరిగాయని, దంతేరాస్ రోజున తమ ద్వారా ఈ కొనుగోళ్లు చేసిన వారి సంఖ్య పది లక్షలు దాటిందని మొబైల్ వాలెట్ కంపెనీ పేటియం బుధవారం తెలిపింది. దంతేరాస్ రోజున తమ ద్వారా బంగారం అమ్మకాలు 12 శాతం పెరిగాయని వెల్లడించింది. పేటియం ద్వారా ఈ కొనుగోళ్లను చిన్న పట్టణాలు, నగరాల్లోనే ఎక్కువగా జరిగాయని, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, జార్కండ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో గరిష్ఠ స్థాయిలో బంగారం డిమాండ్ నమోదయిందని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రారంభించిన ఆరు నెలల్లోనే 120 కోట్ల రూపాయల మేర బంగారం అమ్మకాలు తమ ద్వారా జరగడం ఆనందాన్ని కలిగిస్తోందని వెల్లడించింది. ఈ అమ్మకాలన్నీ కూడా రూ.500 మొదలుకుని క్రమంగా పెరుగుతూ వెళ్లాయని తెలిపింది. పేటియం గోల్డ్ ఫ్లాట్‌ఫామ్‌ను వినియోగదారులు తమ దీర్ఘకాల పొదుపుకోసం వినియోగించుకుంటున్నారని కూడా పేటియం సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ నితిన్ మిశ్రా తెలిపారు. దీనిద్వారా బంగారం కొనుగోలు చేసిన వినియోగదారులకు వాటిని ఇంటికి వచ్చి అందిస్తారని, అలాగే ఆన్‌లైన్‌నూ పారదర్శక రీతిలో విక్రయించేందుకు వీలుంటుందని వెల్లడించారు.