బిజినెస్

నిబంధనలకు విరుద్ధంగా షేర్ల క్రయ విక్రయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: నిబంధనలకు విరుద్ధంగా మహింద్రా అండ్ మహింద్రా లిమిటెడ్ (ఎంఎంఎల్) కంపెనీ షేర్లలో లావాదేవీలు జరిపిన ఆ సంస్థ ఉద్యోగి విజయ్ అనంత్ దోంగ్డేకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబి రూ. 1లక్ష జరిమానా విధించింది. ఆంక్షలు అమలులో ఉన్న వ్యవధిలో వాటాల క్రయవిక్రయాలు జరిపినందుకు ఈ జరిమానా విధించినట్లు సెబి జనరల్ మేనేజర్ డి.సూరారెడ్డి బుధవారం జారీ చేసిన తన ఆదేశాలలో పేర్కొన్నారు. అయితే దోంగ్డే ప్రస్తుతం మహింద్రా అండ్ మహింద్రా కంపెనీలో ఉద్యోగిగా ఉన్నారా? లేదా? అనే విషయాన్ని ఈ ఆదేశాలలో వెల్లడించలేదు. 2013 నవంబర్- డిసెంబర్ 31 మధ్య కాలంలో సెబి నిబంధనలకు విరుద్ధంగా ఎంఎంఎల్ షేర్లలో లావాదేవీలను సంస్థలోని ఒక ఉద్యోగి దోంగ్డే జరిపినట్లు ఆ సంస్థ స్వయంగా చేసిన ఫిర్యాదు మేరకు సెబి దర్యాప్తు జరిపింది. 2013 డిసెంబర్ 31న ముగిసిన త్రైమాసికానికి అన్‌ఆడిటెడ్ ఆర్థిక ఫలితాలను ప్రకటించడానికి ట్రేడింగ్ విండోను మూసివేసిన తరువాత దోంగ్డే ఎంఎంఎల్ షేర్లలో లావాదేవీలు జరిపినట్టు సెబి దర్యాప్తులో తేలింది.