బిజినెస్

స్టాంజోతో కార్బన్ 8 ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: ఎల్‌ఈడి బల్బుల తయారీలో అగ్రగామిగా విస్తరిస్తున్న స్టాంజో ఇండియా లిమిటెడ్ సంస్థ కొత్తగా ఫైబర్ టెక్నాలజీ రంగంలో ప్రవేశించింది. ఇందుకు గాను బ్రిటన్‌కు చెందిన కార్బన్ 8 లిమిటెడ్ సంస్థతో శుక్రవారం హైదరాబాద్‌లో స్టాంజో ఎల్‌ఈడి లిమిటెడ్ ఫ్యాక్టరీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. స్టాంజో ద్వారా రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కార్బన్ 8 ఈ ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా స్టాంజో ఇండియా ఎండి నీరజ్ లకోటియా, మార్కెటింగ్ డైరక్టర్ అలీఖాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎల్‌ఈడి లైట్ల నాణ్యతను పెంచేందుకు వీలుగా ఇప్పటికే ప్రత్యేక లాబొరేటరీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్బన్ 8 అందించే టెక్నాలజీని తమ సంస్థ ద్వారా దేశీయ మార్కెట్లో ప్రవేశపెడతామని వెల్లడించారు.

చిత్రం..ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న స్టాంజో, కార్బన్ 8 ప్రతినిధులు