బిజినెస్

శ్రీసిటీని సందర్శించిన రెప్కో చైర్మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు, అక్టోబర్ 20: రెప్కో హోం ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్) చైర్మన్, భారత మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టి ఎస్ కృష్ణమూర్తి శ్రీసిటీని శుక్రవారం సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి శ్రీసిటీ ప్రత్యేకతలు, పారిశ్రామిక ప్రగతిని వివరించారు. అనంతరం ఆయన శ్రీసిటీ పరిసరాలను పరిశీలించారు. హౌసింగ్ తదితరుల సామాజిక ఆస్తులను పరిశీలించి ఎంతో ఆసక్తితో పలు అభివృద్ధి అంశాలపై శ్రీసిటీ ఎండితో చర్చించారు. కృష్ణమూర్తి శ్రీసిటీ అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేసి భవిష్యత్‌లో ఆర్‌హెచ్‌ఎస్‌ఎల్, శ్రీసిటీల మధ్య వ్యాపార సంబంధాలు నెలకొంటాయన్నారు. కాగా చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్ సంస్థకు హౌసింగ్ ఫైనాన్స్ రంగంలో మంచి గుర్తింపు ఉంది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా 121 బ్రాంచిలు, 30 శాటిటైల్ బ్రాంచ్‌లు ఉన్నాయి.

చిత్రం..కృష్ణమూర్తికి స్వాగతం చెబుతున్న శ్రీసిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డి