బిజినెస్

రుణాల వేటలో ఎయిరిండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా రూ. 1,500 కోట్ల స్వల్పకాలిక రుణాలను తీసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. అత్యవసర వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఈ రుణాలు తీసుకుంటున్నట్టు ఆ సంస్థ ఒక పత్రంలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఎయిరిండియాలోని తన పెట్టుబడులను ప్రైవేటు సంస్థలకు విక్రయించడానికి ఒకవైపు కసరత్తు చేస్తుండగా, ఆ సంస్థ సుమారు నెల రోజుల వ్యవధిలో స్వల్ప కాలిక రుణాల కోసం టెండర్లను ఆహ్వానించడం ఇది రెండోసారి. ప్రభుత్వ హామీ మద్దతుతో రూ. 1,500 కోట్ల స్వల్పకాలిక రుణాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నట్టు ఎయిరిండియా బుధవారం జారీ చేసిన ఒక పత్రంలో పేర్కొంది. ఈ రుణాల గడువు వీటిని తీసుకున్నప్పటి నుంచి వచ్చే సంవత్సరం జూన్ 27 వరకు ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. ఈ గడువును పొడిగించే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఈ రుణాలకు భారత ప్రభుత్వ హామీ 2018 జూన్ 27 వరకు లేదా పెట్టుబడుల ఉపసంహరణ తేదీ వరకు ఉంటుందని ఎయిరిండియా ఆ పత్రంలో వివరించింది. అందువల్ల తనకు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న బ్యాంకులు ఈ నెల 26లోగా ఎంత మొత్తంలో రుణం ఇవ్వదలచుకున్నాయో తెలియజేస్తూ వాటి ఫైనాన్షియల్ బిడ్లు సమర్పించాలని ఎయిరిండియా కోరింది. ఈ బిడ్లలో ఎంపికయిన బ్యాంకులకు అంగీకార పత్రం అందజేసిన తరువాత మూడు పని దినాలలో ఈ స్వల్ప కాలిక రుణాలను పొందాలని ఎయిరిండియా భావిస్తోందని ఆ పత్రం వెల్లడించింది. ఎయిరిండియా గత నెలలో కూడా రూ. 3,250 కోట్ల స్వల్పకాలిక రుణాల కోసం ఫైనాన్షియల్ బిడ్లను ఆహ్వానించింది. అప్పుడు కూడా అత్యవసర వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం స్వల్పకాలిక రుణాలను కోరుతున్నట్టు తెలిపింది. అయితే అప్పుడు ఎయిరిండియా కోరిన మొత్తంలో రుణాలు లభించాయా? లేదా? అనేది వెల్లడించలేదు.