బిజినెస్

మూడు దేశాల రహదారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, మే 23: భారత్, థాయిలాండ్, మయన్మార్ దేశాలు 1,400 కిలోమీటర్ల పొడవైన రహదారి నిర్మాణానికి సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు థాయిలాండ్‌లో భారత రాయబారి భగవంత్ సింగ్ బిష్ణోయ్ తెలిపారు. ఈ రహదారి ఆగ్నేయాసియాతో భారత్‌ను అనుసంధానించనుందని చెప్పారు. మయన్మార్‌లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నిర్మించిన 73 వంతెనలు శిథిలావస్తకు చేరాయని, వీటిని భారత్ అందించే ఆర్థిక సాయంతో పునర్నిర్మిస్తారని, 18 నెలలో వీటి నిర్మాణం పూర్తవుతుందని ఆయన తెలిపారు. దీంతో మూడు దేశాల మధ్య రాకపోకలు బలపడి వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల వృద్ధికి కారణమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తూర్పు భారతంలో మోరా నుంచి మొదలయ్యే ఈ ప్రతిపాదిత రహదారి.. మయన్మార్‌లోని టాము పట్టణం వరకు కొనసాగుతుంది. కాగా, థాయిలాండ్‌లోని తఖ్ వరకు ఈ రోడ్డును నిర్మించేందుకు ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి. నిరుడు భారత్-్థయ్‌లాండ్ వాణిజ్యం విలువ 8 బిలియన్ డాలర్లుగా నమోదైంది.