బిజినెస్

టిఎస్‌పిడిసిఎల్‌కు ఐపిపిఏఐ పవర్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్‌పిడిసిటిఎల్)కు ఇన్నోవేషన్ కేటగిరిలో ‘ఐపిపిఎఐ పవర్ అవార్డు-2017’ లభించింది. సంస్థ పరిధిలో సౌర విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయ విద్యుత్ రంగంలో యాజమాన్య పద్దతుల అమలు, ఎల్‌ఈడి లైట్ల పంపిణీ, పంపిణీ వ్యవస్థలో హెచ్‌విడిఎస్ పద్దతి అమలు, పంపిణీ నష్టాల తగ్గింపునకు చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించిందని ఎస్‌పిడిసిటిఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 28న కర్ణాటకలోని బెల్గామ్‌లో స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తి దారుల సంఘం (ఐపిపిఏఐ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న 18వ రెగ్యులేటర్స్, పాలసీ మేకర్స్ రిట్రీట్ కార్యక్రమంలో ఈ అవార్డును సంస్థ సిఎండి జి.రఘుమారెడ్డి అందుకుంటారు. సౌరవిద్యుత్ ఉత్పత్తి విషయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వికేంద్రీకృత భాగస్వామ్య విద్యుత్ ఉత్పత్తి మోడల్‌ను ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా సౌర విద్యుత్ 2000 మెగావాట్ల కొనుగోలుకు టెండర్లు పిలిచి విజయవంతంగా పూర్తి చేసింది. దీని నుంచి 250 మెగావాట్ల సౌర విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం చేయబడిందని సంస్థ పేర్కొంది. 2.6 లక్షల ఎల్‌ఈడి బల్బుల పంపిణీ చేపట్టి 34 మిలియన్ యూనిట్ల విద్యుత్ పొదుపు చేసినట్లు తెలిపింది. గ్రామీణ విద్యుత్ పంపిణీ వ్యవస్థలో హై ఓల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ పథకం (హెచ్‌డిఎస్)ను అమలు చేయడం వల్ల పంపిణీ నష్టాలను పెద్ద ఎత్తున తగ్గించేందుకు కృషి జరిగింది. తద్వారా రూ.135 కోట్ల విలువైన 300 మిలియన్ల యూనిట్ల విద్యుత్ పొదుపు జరిగిందని పంపిణీ సంస్థ వెల్లడించింది.

చిత్రం..సిఎండి జి.రఘుమారెడ్డి