బిజినెస్

చైనా నుంచి ముప్పు తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 26: చైనా తన ఆర్థిక వ్యవస్థ మందగిస్తోందంటూ చూపిస్తున్న గణాంకాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యంగా సార్క్ దేశాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరిస్తూ, మార్కెట్‌లో జోక్యం చేసుకోవడం ద్వారా ఆర్‌బిఐ తీవ్రమైన కరెన్సీ ఆటుపోట్ల ప్రభావాన్ని తగ్గిస్తూ వస్తోందన్నారు. బైటినుంచి ఎదురయ్యే ముప్పులను తట్టుకుని నిలబడడానికి భారత దేశానికి మంచి విధానం ఉండడమే కారణమని ఆయన అన్నారు. గురువారం ఇక్కడ సార్క్ ఫైనాన్స్ గవర్నర్లసదస్సులో రాజన్ మాట్లాడుతూ వృద్ధి రేటును పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న వివిధ వ్యవస్థాగత సంస్కరణలను కూడా వివరించారు.
చైనా ఆర్థిక వ్యవస్థ చూపిస్తున్న గణాంకాల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన ముఖ్యంగా దానికి ఆనుకుని ఉన్న సార్క్ దేశాల ఆర్థిక వ్యవస్థలపైన ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం ఉందని ఆయన అంటూ, భారత్‌లాంటి దేశాలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుత బ్యాకింగ్ వ్యవస్థలో మొండిబకాయిల బెడద పెరగడం, మధ్యవర్తిత్వ బ్యాంకింగ్ వ్యవస్థలో బలహీనతలు సార్క్ దేశాల ఆర్థిక వృద్ధి మందగమనానికి కారణమవుతున్నాయన్నారు. చైనా వృద్ధి రేటు కేవలం దాని విధానాలపై ఆధారపడి లేదని, ప్రపంచ దేశాల వృద్ధిపైన కూడా ఆధారపడి ఉందని ఆర్‌బిఐ గవర్నర్ అన్నారు. ద్రవ్య లోటును తగ్గించడానికి, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆయన చెప్తూ, బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిలను పూర్తిగా తుడిచేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని, ప్రపంచ అనిశ్చితుల నేపథ్యంలో తాము నేర్చుకున్న పాఠాలు ఇవని అన్నారు.