బిజినెస్

సరైన దిశలోనే సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: ఆర్థిక సంస్కరణలు, విధాన నిర్ణయాల విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం సరైన దిశలోనే ముందుకు సాగుతోందని, అయితే మోదీ ప్రభుత్వానికి ప్రజలు బలమైన తీర్పు ఇచ్చినప్పటికీ భారత్‌లో సంస్కరణలు, విధాన నిర్ణయాలు పూర్తి సజావుగా ముందుకు సాగడం లేదని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ ‘డిబిఎస్’ పేర్కొంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిబిఎస్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎన్‌డిఎ ప్రభుత్వానికి ప్రజలు భారీ మెజార్టీని కట్టబెట్టినప్పటికీ ప్రతిపక్షాల నుంచి, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత మూలంగా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లు సహా కొన్ని కీలక బిల్లులు రాజ్యసభలో ఆమోదానికి నోచుకోకపోవడాన్ని డిబిఎస్ ప్రస్తావించింది. ‘ఆర్థిక సంస్కరణలు, విధాన నిర్ణయాల విషయంలో మోదీ ప్రభుత్వం సరైన దిశలోనే ముందుకు సాగుతోంది. దేశంలో చమురు ధరలపై నియంత్రణ తొలగించడం, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం, దివాలా చట్టాన్ని ఆమోదించడం, దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రజలను భాగస్వాములను చేయడం, ఆధార్ బిల్లుకు ఆమోదముద్ర వేయించడం, బొగ్గు గనుల వేలంతో పాటు విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు వీటిలో ముఖ్యమైనవి’ అని డిబిఎస్ తన పరిశోధనా పత్రంలో స్పష్టం చేసింది. అయితే రాజకీయ, శాసన సంబంధమైన అడ్డంకుల కారణంగా జిఎస్‌టి, కార్మిక, భూ సంస్కరణలకు సంబంధించిన కొన్ని కీలక బిల్లులు ఇప్పటికీ ఆమోదానికి నోచుకోకుండా ఆగిపోయాయని, ఈ ఏడాది రాజ్యసభలో ఎన్‌డిఎ బలం కొంత మేర పెరిగే అవకాశం ఉన్నప్పటికీ అది ఏకపక్షంగా జిఎస్‌టి బిల్లును ఆమోదింపజేసుకునేందుకు సరిపోదని, కనుక కీలక బిల్లుల ఆమోదానికి ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రతిపక్షాలతో ఏకాభిప్రాయాన్ని కుదుర్చుకోక తప్పదని, అయినప్పటికీ ప్రస్తు ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) 7.6 శాతం వృద్ధి చెందే అవకాశాలున్నాయని డిబిఎస్ పేర్కొంది.