బిజినెస్

రెండో రోజూ బుల్ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 26: బుధవారం భారీ లాభాల్లో పరుగులు పెట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా అదే ఊపును కొనసాగించాయి. దీంతో బిఎస్‌ఇ సెనె్సక్స్ దాదాపు ఏడునెలల గరిష్ఠస్థాయి అయిన 26,367 పాయింట్లకు చేరుకుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ పరపతి సమీక్ష తర్వాత తన వడ్డీ రేట్లను పెంచకపోవచ్చన్న అంచనాలకు తోడు క్రూడాయిల్ ధరలు మరోమారు అట్టడుగు స్థాయికి చేరవంటూ వచ్చిన విశే్లషణలతో మే నెల ఫ్యూచర్స్, ఆప్షన్స్‌కు చివరి రోజయిన గురువారం సెషన్ ప్రారంభంనుంచే సూచీలు లాభాల బాటలో పరుగులు పెట్టాయి. మార్చి త్రైమాసికానికి సంబంధించి చివరి విడత కార్పొరేట్ ఫలితాలు ఆశించిన స్థాయికన్నా మెరుగ్గా ఉండడం కూడా మార్కెట్ పరుగుకు తోడ్పడింది. దీనికి తోడు రుతుపవనాలు మూమూలుస్థాయికి మించి ఉంటాయన్న అంచనాలు, డాలరుతో రూపాయి బలపడ్డం లాంటివి సైతం మదుపరుల ఉత్సాహానికి తోడయ్యాయి.
దీంతో నిన్నటిముగింపుకన్నా బలంగా మొదలైన సెనె్సక్స్ ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ చివరికి 485.51 పాయింట్లు లాభపడి 26,366.68 పాయింట్ల వద్ద స్థిరపడింది. గత ఏడాది నవంబర్ 4వ తేదీ తర్వాత సెనె్సక్స్ ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం తిరిగి 8 వేల పాయింట్లను దాటి ఒక దశలో 8,083 పాయింట్లను తాకింది. చివరికి 134.75 పాయింట్ల లాభంతో 8,069.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. మార్చి త్రైమాసికంలో ఎల్‌అండ్‌టి నికర లాభాలు 18.5 శాతం పెరిగిన నేపథ్యంలో ఆ కంపెనీ స్టాక్ దాదాపు 14 శాతం పెరిగింది. ఎస్‌బిఐ, బిహెచ్‌ఇఎల్, యాక్సిస్ బ్యాంక్, ఒఎన్‌జిసి షేర్లు కూడా మంచి లాభాలు ఆర్జించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఆసియా మార్కెట్లు లాభాలతో ముగియగా, నిన్న వాల్‌స్ట్రీట్ లాభాలతో ముగిసిన నేపథ్యంలో ఐరోపా మార్కెట్లు సైతం ప్రారంభంలోనే లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.