బిజినెస్

ఆర్థిక వ్యవస్థకు చోదకశక్తిగా గృహనిర్మాణ రంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాఖపట్నం, మే 28: గృహనిర్మాణ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి సాధిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ అభిప్రాయపడ్డారు. విశాఖతో పాటు ప్రధాన పట్టణాల్లో గృహనిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గృహనిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులతో విశాఖలో శనివారం సమావేశమైన ఆయన ఉద్యోగ, కార్మిక వర్గాలకు అనుకూలంగా ఉండేలా గృహనిర్మాణాన్ని చేపట్టాలన్నారు. ఒక్కో ప్రాజెక్టు కనీసం 100 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టేలా చూడాలని, ఇందుకు అవసరమయ్యే భూమిని సమీకరణ విధానంలో తీసుకుంటామన్నారు. ఒక్కో ప్రాజెక్టులో పాఠశాల, వైద్య సదుపాయం, వాణిజ్య సముదాయాలు ఉండే విధంగా చూడాలని, వీటికి అవసరమయ్యే అనుమతులు 21 రోజుల్లోగా మంజూరు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. చేపట్టే ప్రాజెక్టులు ఏడాది, ఏడాదిన్నర కాల వ్యవధిలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఉద్యోగ, కార్మిక వర్గాలు వారు చెల్లిస్తున్న ఇంటి అద్దెకు సమానంగా ఉండేలా సులభ వాయిదాలపై గృహాలను మంజూరు చేస్తే వెసులుబాటుగా ఉంటుందని సూచించారు. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం సొంతింటి కలను నిజం చేసుకునే వర్గాలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఉద్యోగులు పనిచేసే ప్రాంతాల్లోనే ఈ భారీ శాటిలైట్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయడం ద్వారా సమయం ఆదాకావడంతో పాటు సౌలభ్యంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలో బ్రాండిక్స్ వంటి కంపెనీల్లో సుమారు 60వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరికోసం రెండు లక్షల గృహాలను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. ఇక విశాఖ నగరం చుట్టూ ఐదు శాటిలైట్ టౌన్‌షిప్‌లను నిర్మించేందుకు ప్రతిపాదించామన్నారు. నక్కపల్లి ప్రాంతంలో కూడా మరో లక్ష ఇళ్లతో టౌన్‌షిప్‌ను తీర్చిదిద్దాలని బిల్డర్లకు సూచించారు. ఈ సందర్భంగా నగరంలో ఇప్పటి వరకూ నిర్మించిన గృహ సముదాయాలు, తదితర అంశాలను వివరించారు. ఇదే సందర్భంలో బిల్డర్లు నిర్మాణ రంగంలో ఎదురవుతున్న ఇబ్బందులను, అనుమతులు, ఇతర అంశాల్లో లోపాలను సిఎస్ దృష్టికి తీసుకువెళ్లారు.
ప్రమాదరహిత పారిశ్రామిక నగరంగా విశాఖ
పారిశ్రామిక నగరంగా ఎదుగుతున్న విశాఖను ప్రమాదరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు టక్కర్ తెలిపారు. పరిశ్రమల యజమానులు, కాలుష్య నియంత్రణ మండలి, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇతర విభాగాల అధికారులతో విశాఖలో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో విశాఖలో పారిశ్రామిక ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల బారినపడి మరణించిన కార్మికులు, ఉద్యోగులకు నష్టపరిహారం చెల్లించడంతోపాటు బీమా పరిహారం అత్యధికంగా అందేలా చూడాలన్నారు. దీనికోసం ఒక నిర్ధిష్ట ప్రతిపాదనలు రూపొందించుకుని, బాధిత కార్మికులకు, వారి కుటుంబీకులకు పెద్ద మొత్తంలో పరిహారం అందేలా చూడాలన్నారు. కాగా, పరిశ్రమల్లో భద్రత, కాలుష్య నియంత్రణ తదితర అంశాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ పర్యవేక్షణలో కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టరీ తనిఖీ అధికారి, రెవెన్యూ, వుడా, పోలీసు, తదితర విభాగాలకు చెందిన 150 మందితో కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపా రు. నెలనెలా ప్రమాదాలు, వాటి నియంత్రణ తదితర అంశాలపై సమీక్షిస్తుందన్నారు. గత ఐదేళ్లలో 16 ప్రమాదాలు చోటుచేసుకున్నాయన్న టక్కర్.. వాటిపై తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. ఇక విశాఖలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే 94 ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయని, ఐదుగురు సభ్యులతో కూడిన బృందం విశాఖలో పర్యటించి నిర్ణయం తీసుకుంటుందన్నారు.

చిత్రం విశాఖ బిల్డర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ సమీక్ష