బిజినెస్

అక్రమార్జనపరులను విచారిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 28: నల్లధన కుబేరులపై కఠిన చర్యలు తప్పవని మరోసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. ‘పనామా పేపర్లు’పై స్పందిస్తూ అక్రమార్జనపరులు విచారణను ఎదుర్కోవాల్సిందేనని, వారు తప్పించుకోలేరని స్పష్టం చేశారు. రెండేళ్ల పాలనపై శనివారం ఇక్కడ ఇండియా గేట్ వద్ద ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో జైట్లీ మాట్లాడుతూ ‘పనామా కేసులో పేర్లున్నవారి ఖాతాల్లో నల్లధనం ఉన్నట్లు గుర్తిస్తే.. అప్పుడు వారు హెచ్‌ఎస్‌బిసి ఖాతాల కేసులోనూ విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది.’ అన్నారు. పన్ను ఎగవేతదారులకు స్వర్గ్ధామాలైన దేశాల్లో ఖాతాలున్న సంస్థలకు సంబంధించినవారి జాబితాను పనామా పేపర్స్ బహీర్గతం చేసినది తెలిసిందే. ఇందులో వందలాదిగా భారతీయులూ ఉన్నదీ విదితమే. ఇదిలావుంటే 8-9 శాతం వృద్ధిరేటును భారత్ సాధిస్తుందని, అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగిస్తే ఇది కష్టసాధ్యం కావచ్చన్నారు.

చిత్రం ఇండియా గేట్ వద్ద మాట్లాడుతున్న అరుణ్ జైట్లీ