బిజినెస్

అరవింద్ ఫ్యాషన్‌లో ‘సచిన్’ బ్రాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 28: అరవింద్ ఫ్యాషన్ బ్రాండ్స్.. శనివారం ట్రూ బ్లూ పేరిట ఓ ప్రీమియం మెన్స్‌వేర్, యాక్ససరీస్ బ్రాండ్‌ను ప్రారంభించింది. క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ సారథి సచిన్ తెండూల్కర్ భాగస్వామ్యంతో ఈ సరికొత్త బ్రాండ్‌ను అరవింద్ ఫ్యాషన్ ఆవిష్కరించింది. ఈ బ్రాండ్‌కు సంబంధించి రాబోయే ఐదేళ్లలో దాదాపు 30 స్టోర్లను ప్రారంభించాలని సంస్థ భావిస్తోంది. సుమారు 200 కోట్ల రూపాయల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నామని అరవింద్ ఫ్యాషన్ బ్రాండ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజీవ్ మెహతా చెప్పారు. ఇదిలావుంటే ముంబయిలో ట్రూ బ్లూ తొలి స్టోర్‌ను శనివారం తెరిచారు. కాగా, సచిన్-అరవింద్ ఫ్యాషన్ జాయింట్ వెంచర్‌లో వచ్చిన ట్రూ బ్లూ భాగస్వామ్య వివరాలను మాత్రం మెహతా వెల్లడించలేదు. అయితే తెండూల్కర్ అభిరుచికి తగ్గట్లుగా దుస్తుల డిజైన్లుంటాయని, 300లకుపైగా మోడళ్లను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. భారతీయ దుస్తుల మార్కెట్‌లో మెన్స్‌వేర్ అతిపెద్ద విభాగం. 42 శాతం రకరకాల మెన్స్‌వేర్ దుస్తులే ఉంటాయి. రాబోయే ఐదేళ్ళలో ఇది 8.5 శాతం వృద్ధిని అందుకుంటుందని అంచనా. ఈ క్రమంలో మెన్స్‌వేర్‌ను ట్రూ బ్లూ కొత్త పుంతలు తొక్కించగలదన్న విశ్వాసాన్ని మెహతా వ్యక్తం చేశారు.

చిత్రం అరవింద్ ఫ్యాషన్ బ్రాండ్స్ ప్రతినిధులతో సచిన్ తెండూల్కర్