బిజినెస్

‘బంగారు తెలంగాణ’ కోసం బ్యాంకుల విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: ‘బంగారు తెలంగాణ’ సాధనకోసం బ్యాంకులు కూడా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో బ్యాంకులు యుద్ధప్రాతిపదికన అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ అంశంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఉన్నతాధికారులతో ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు పర్యాయాలు చర్చలు జరిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణలో లీడ్‌బ్యాంక్‌గా పనిచేస్తోంది. పైగా రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బిసి) కి ఎస్‌బిఐ నాయకత్వం వహిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తోందని, ఇవి సక్రమంగా ప్రజలకు చేరేందుకు బ్యాంకుల శాఖలు పెంచాలని ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి కోరడంతో బ్యాంకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆర్‌బిఐ, ఎస్‌బిఐ సానుకూలంగా స్పందించాయి. ఈ ఏడు మరో 250 బ్రాంచీలను ఏర్పాటు చేయాలని స్టేట్ లెవల్ బ్యాంకర్స్ మీటింగ్‌లో ఇటీవలే నిర్ణయించారు. ఇప్పటికే 49 బ్రాంచీలను ఏర్పాటు చేశారు. ఏ ఏ ప్రాంతాల్లో బ్రాంచీలు అవసరం ఉందో పరిశీలన చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వాణిజ్య, గ్రామీణ, సహకార తదితర బ్యాంకులకు చెందిన 5444 శాఖలు పనిచేస్తున్నాయి. వీటిలో డిపాజిట్లు కూడా గత మూడేళ్ల నుండి పెరుగుతున్నాయి. గత ఏడాది 3,62,574 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉండగా, ఈ ఏడాది జూన్ చివరి వరకు 3,85,390 కోట్లకు చేరింది. డిపాజిట్లు పెరగడంతో పాటు ప్రజలకు ఇస్తున్న రుణాలు కూడా పెరుగుతున్నాయి. కేంద్రప్రభుత్వ జన్‌ధన్‌యోజన పథకాన్ని చేపట్టింది. జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటే డబ్బు ఏమీ డిపాజిట్ చేయకుండానే బ్యాంకులో అకౌంట్ ప్రారంభించేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. దాంతో 87.77 లక్షల మంది బ్యాంకుల్లో అకౌంట్లు ప్రారంభించారు. ఇంత పెద్ద మొత్తంలో గత అరవై సంవత్సరాల్లో ఏనాడూ బ్యాంకుల్లో అకౌంట్లు ప్రారంభం కాలేదు. పేదలు తాము కూడబెట్టుకున్న 1400 కోట్ల రూపాయలను ఈ అకౌంట్లలో వేసుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక అంశాలకు సంబంధించి సమగ్ర ప్రణాళిక రూపొందించింది. ప్రభుత్వం-బ్యాంకులు-లబ్దిదారుల మధ్య సమన్వయం ఉండేలా చూడటమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా వివిధ పథకాలకు సంబంధించి డబ్బును ప్రభుత్వం నేరుగా లబ్దిదారుల పేర్లతో బ్యాంకుల్లో జమచేస్తోంది. వ్యవసాయ దారులకు ఇన్‌పుట్ సబ్సిడీ నిధులతో పాటు ఇతరత్రా ఆర్థిక సాయం చేయడంతో పాటు బీమా డబ్బును మొత్తం బ్యాంకుల్లోనే జమచేస్తున్నారు. అలాగే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, మహిళాగ్రూపులకు చేసే ఆర్థిక సాయం, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరిమహిళలు తదితర సంక్షేమ పింఛన్ల డబ్బును కూడా బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాల డబ్బును కూడా బ్యాంకుల్లో లబ్దిదారుల పేర్లతో జమ చేస్తున్నారు. ఈ పరిస్థితిలో ప్రతి ఐదువేల జనాభాకు ఒక బ్యాంక్ బ్రాంచీ ఏర్పాటు చేయాలని ఆర్‌బిఐ 2017 మే 18 న ఒక సర్క్యులర్ జారీ చేసింది. రేషలైజేషన్ ఆఫ్ బ్రాంచ్ ఆథరైజేషన్ పాలసీకి గైడ్‌లైన్స్‌ను రూపొందించింది.
ఈ అంశాలన్నీ పరిశీలించిన ఎస్‌ఎల్‌బిసి చైర్మన్, ఎస్‌బిఐ చీఫ్ జనరల్ మేనేజర్ ప్రమోద్ పరఖ్ అన్ని బ్యాంకుల ఉన్నతాధికారులతో ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి, బ్యాంకుల విస్తరణపై చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాలను విజయంతం చేసేందుకు అన్ని బ్యాంకులు సహకరించాలని ఆయన కోరారు. ఇందుకు అనుగుణంగా వివిధ బ్యాంకులు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి.