బిజినెస్

డిఎల్‌ఎఫ్‌కు మరింతగా రుణభారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 28: దేశీయ నిర్మాణరంగ దిగ్గజం డిఎల్‌ఎఫ్ నికర రుణాలు ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో మరింతగా పెరిగాయి. ఈ మూడు నెలల్లో దాదాపు 800 కోట్ల రూపాయలు ఎగిశాయి. నిర్మాణ రంగంలో నెలకొన్న మందగమనం మధ్య సంస్థ రుణభారం పెరిగిపోగా, 22,202 కోట్ల రూపాయలకు చేరుకుంది. నిరుడు డిసెంబర్ 31 నాటికి సంస్థ రుణాలు 21,411 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఇకపోతే తమ అనుబంధ సంస్థ డిఎల్‌ఎఫ్ సైబర్ సిటీ డెవలపర్స్ లిమిటెడ్ (డిసిసిడిఎల్)లో వాటా కొనుగోలుకు జూన్ నుంచి కొనుగోలుదారులు రావచ్చన్న ఆశాభావాన్ని డిఎల్‌ఎఫ్ వ్యక్తం చేసింది. 40 శాతం వాటా అమ్మకానికి డిఎల్‌ఎఫ్ సిద్ధమవగా, దీని ద్వారా 12,000-14,000 కోట్ల రూపాయల మేర నిధులు చేతికి అందవచ్చని అంచనా వేస్తోంది.