బిజినెస్

పతాక స్థాయికి చేరిన చమురు స్మగ్లింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 17: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పోర్టు కేంద్రంగా తీరంలో చమురు స్మగ్లింగ్ పతాకస్థాయికి చేరింది. కొందరు ప్రజాప్రతినిధులు, పోలీసుల అండ చూసుకుని స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. అనేక సంవత్సరాలుగా కాకినాడ తీరం చమురు స్మగ్లింగ్‌కు అడ్డాగా మారింది. ఒకపుడు సామాన్యులుగా ఉన్నవారు స్మగ్లర్ల అవతారమెత్తి, కోట్లు గడించారు. వారి హవా నేటికీ కాకినాడ పోర్టు పరిసరాల్లో కొనసాగుతోంది. ఇదంతా ప్రజాప్రతినిధులు, పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులకు, పోర్టు అధికారులకు తెలిసే జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆయిల్ మాఫియా వ్యవహారం ఇటీవల ఇరువురు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల మధ్య అగాధాన్ని సృష్టించింది. మాఫియాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఓ ఎమ్మెల్యే తీరుపై మరో ఎమ్మెల్యేను బాహాటంగా విమర్శించడం టిడిపి వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. కేవలం రాజకీయ నాయకుల అండ, పోలీసు అధికారుల నిఘా లోపం కారణంగా ఏటా కాకినాడ పోర్టు కేంద్రంగా వందల కోట్ల రూపాయల మేర చమురు స్మగ్లింగ్ జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. గతంలో అడపాదడపా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినప్పటికీ అసలైన దోషులు మాత్రం తప్పించుకుని తిరుగుతున్నట్టు తెలుస్తోంది.
కాకినాడ తీరంలో కాకినాడ సీపోర్టు ప్రైవేట్ లిమిటెడ్ (కెఎస్‌పిఎల్) ఆధీనంలో డీప్ వాటర్ పోర్టు, ప్రభుత్వ ఆధీనంలో యాంకరేజ్ పోర్టు ఉన్నాయి. ఈ రెండు పోర్టులకు సరుకు రవాణా నిమిత్తం విదేశాల నుండి నిత్యం నౌకలు రాకపోకలు సాగిస్తుంటాయి. యాంకరేజ్ పోర్టుకు వచ్చే నౌకలు తీరంలో లంగరు వేసివుంటాయి. డీప్ వాటర్ పోర్టుకు వచ్చే నౌకలు కూడా లంగరు వేసివుంటాయి. పోర్టులో నౌకలను ఆపివుంచే బెర్త్‌లు (జెట్టీలు) ఖాళీ లేని పక్షంలో నౌకలను రోజుల తరబడి సముద్రంలో లంగరువేసి ఉంచుతారు. ఈ నేపథ్యం స్మగ్లర్లకు బాగా కలసివస్తోంది. లంగరు వేసివున్న నౌకల సిబ్బందితో బ్రోకర్లకున్న సంబంధాల మేరకు బేరసారాలు జరుగుతాయి. ఆగివున్న నౌకల నుండి కారుచౌక ధరకు డీజిల్‌ను స్మగ్లర్లు సేకరిస్తారు. ఇదంతా అర్ధరాత్రి సమయాల్లో జరుగుతోంది. కాకినాడ తీర ప్రాంత మార్గంలో నాటు పడవల సహాయంతో నౌకల వద్దకు స్మగర్ల అనుయాయులు చేరుకుంటారు. అప్పటికే సిద్ధంగా ఉన్న నౌకల సిబ్బంది డీజిల్‌ను డ్రమ్ములు, పీపాల్లో లోడ్ చేస్తారు. డీజిల్ విక్రయం అనంతరం విదేశీ నౌకల సిబ్బందికి స్మగ్లర్లు డాలర్ల రూపంలోనే సొమ్ము చెల్లిస్తుండటం విశేషం. ఈ వ్యవహారం గతంలో కేంద్ర నిఘా వర్గాలు జరిపిన దాడిలో బయటపడింది.
అక్రమ డీజిల్ రవాణా ఇలా...
నౌకల నుండి సేకరించిన డీజిల్‌ను నాటు పడవల్లో తీరానికి తీసుకువచ్చిన పిమ్మట రహస్య స్థావరాలకు తరలిస్తారు. ఆ స్థావరాల్లో సిద్ధంగా ఉన్న ఆయిల్ ట్యాంకర్లలో లోడ్ చేస్తుంటారు. ఈ విధంగా సేకరించిన డీజిల్‌ను స్మగర్లు వివిధ మార్గాల్లో విక్రయాలు సాగించి కోట్లు గడిస్తున్నారు. జిల్లాలోని తీరప్రాంతంలో నిత్యం వేల సంఖ్యలో మెకనైజ్డ్ బోట్లు వేట సాగిస్తుంటాయి. బోట్ల యజమానులు పెట్రోల్ బంకులను ఆశ్రయించాల్సింది పోయి స్మగ్లర్ల నుండి డీజిల్ కాస్త చౌకగా లభిస్తుండటంతో వారి వద్దనే కొనుగోలు చేస్తుంటారు. అలాగే జిల్లాలో తమతో సంబంధాలు కలిగిన పెట్రోల్ బంకులకూ స్మగ్లర్లు డీజిల్ విక్రయిస్తుంటారు. ఈ వ్యవహారంలో పలువురు నాయకులు, పోలీసు ఇతర శాఖల అధికారులకు ముడుపులు అందుతుండటంతో చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.