బిజినెస్

పసిడికి గిరాకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: దేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో పాటు అంతర్జాతీయంగా సానుకూల పవనాలు వీస్తుండటంతో బంగారానికి గిరాకీ పెరిగింది. దీంతో శనివారం పుత్తడి ధర భారీగా పెరిగింది. గత రెండు రోజుల వ్యవధిలో రూ.175 తగ్గిన 10 గ్రాముల బంగారం ధర శనివారం ఒకే రోజు 325 రూపాయల మేరకు పెరిగి 30,775 రూపాయలకు చేరుకుంది. అలాగే వెండి ధర కూడా పుంజుకుని రూ.41 వేల మార్కును దాటింది. పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో శనివారం కిలో వెండి ధర రూ.600 పుంజుకుని 41,150 రూపాయలకు చేరుకుంది. ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని స్థానిక ఆభరణ వర్తకులు భారీగా పుత్తడి కొనుగోళ్లు జరుపుతుండటంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోందని, అంతేకాకుండా అంతర్జాతీయంగా అమెరికా డాలర్‌కు సెంటిమెంట్ బలహీనంగా ఉండటం కూడా బంగారం ధరల పెరుగుదలకు మరో కారణమని బులియన్ వర్తకులు చెబుతున్నారు. ప్రస్తుతం సింగపూర్‌లో బంగారం ధర ఔన్సుకు 0.04 శాతం చొప్పున పెరిగి 1,755.62 సింగపూర్ డాలర్లకు, న్యూయార్క్‌లో 1.18 శాతం పెరిగి 1,293.40 డాలర్లకు చేరుకోగా, దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.325 పెరిగి 30,775 రూపాయలకు, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా రూ.325 పెరిగి 30,625 రూపాయలకు చేరుకుంది.