బిజినెస్

ఆగని దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుసగా నాలుగో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్లు బలంగా నిలబడ్డాయి. జర్మనీ రాజకీయ పరిణామాలు ఐరోపా మార్కెట్లను కుదిపేసే అవకాశం ఉందన్న కథనాలు కూడా భారత మార్కెట్ల దూకుడును ఆపలేకపోయాయి. ఫార్మా కంపెనీలు సానుకూలంగా ముందుకు వెళ్లాయి. అమెరికా ఎఫ్‌డిఏ క్లియరెన్సుల ప్రభావం మరింతగా ఈ కంపెనీలకు ఊతాన్నిచ్చింది. నేటి లావాదేవీల్లో వివిధ దశల్లో ఊగిసలాడిన సెనె్సక్స్ అంతిమంగా 118.46 పాయింట్లు పెరిగి 33,478.35 వద్ద ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌యు, నిఫ్టీ కూడా 28.15 పాయింట్లు పెరిగి 10,326.90 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు, అలాగే వాల్‌స్ట్రీట్ నుంచి అందిన సానుకూల సంకేతాల ప్రభావంతో ఇనె్వస్టర్లు కార్పొరేట్ షేర్లపై దృష్టిపెట్టారు. నేటి లావాదేవీల్లో డాక్టర్ రెడ్డీస్ షేర్లు భారీగా రాణించాయి. ఈ కంపెనీ షేర్ విలువ 4.99 శాతం మేర పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ కూడా 1.47 శాతం మేర పెరిగాయి. సన్‌ఫార్మా, సిప్లా, భారతి ఎయిర్‌టెల్, ఎన్‌టిపిసి షేర్లు కూడా బలంగా పుంజుకున్నాయి.