బిజినెస్

ప్రత్యామ్నాయ ఇంధనం అందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: కాలుష్యానికి తీవ్రంగా కారణమవుతున్న పెట్రోలియం, కోక్, ఫర్నేస్ ఆయిల్‌ను నిషేధించిన రాష్ట్రాలకు సహజ వాయువును, ప్రత్యామ్నాయ ఇంధనాన్ని సరఫరా చేయాలని ప్రభుత్వరంగ చము రు కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. బొగ్గుకు బదులుగా కాలు ష్య కారకమైన పెట్రోలియం కోక్‌ను వినియోగించడాన్ని సుప్రీంకోర్టు గత నెలలో నిషేధించిన నేపథ్యంలో ప్రభు త్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా దేశ రాజధాని శివారు ప్రాంతాల్లో పెట్రోలియం కోక్‌తో పాటు ఫర్నేస్ ఆయిల్ వినియోగం తీవ్రం కావడం వల్లే కాలుష్యం పెరిగిపోతోందన్న ఆందోళనల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పు అమలులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం తక్షణ ప్రాతిపదికన పెట్రో కోక్, ఫర్నేస్ ఆయిల్ అమ్మకాన్ని, వినియోగాన్ని నిషేధిస్తూ ఈ నెల 18న నోటిఫికేషన్ జారీచేసిం ది. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ కాలుష్య కారక ఇంధనాలను వినియోగించడానికి వీల్లేదని, ఆదేశాలు జారీచేసేవరకూ నిషేధం అమలులో వుంటుందని కేంద్ర ఇంధ న శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మం గళవారం నాడిక్కడ స్పష్టం చేశారు.