బిజినెస్

గమ్‌తో స్మోకింగ్ బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: ధూమపానం మానేందుకు గ్లెన్ మార్క్ ఫార్మాసూటికల్ కంపెనీ క్విట్జ్ థెరపీ పేరిట ఒక గమ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. వైద్య నిబంధనలకు అనుగుణంగా ఈ గమ్‌ను విడుదల చేసినట్లు ఆ సంస్ధ అధ్యక్షుడు సుజేష్ వాసుదేవన్ తెలిపారు. రోజుకు 20 కంటే సిగరెట్లు కాల్చే వారి కోసం క్విట్జ్ 2ఎంజి గమ్‌ను, 20 కంటే ఎక్కువ సిగరెట్లు కాల్చే వారికి క్విట్జ్ 4 ఎంజి గమ్‌ను రూపొందించినట్లు ఆయన చెప్పారు. దీనికి క్విట్జ్ నికోటిన్ రిప్లేస్‌మెంట్ థెరపీగా నామకరణం చేశామన్నారు. ఈ గమ్‌ను వినియోగించేవారికి క్రమేపి సిగరెట్లు కాల్చాలన్న ఆత్రుత తగ్గుతుందన్నారు. నికోటిన్ రిప్లేస్‌మెంట్ థెరపీని ప్రయోగాత్మకంగా అమలు చేసి చూశామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ అంచనా ప్రకారం సాలీనా ప్రపంచంలో ఆరు మిలియన్ల మంది పొగాకు వల్ల మరణిస్తున్నారన్నారు.